Special Drive Against Road Encroachments
రోడ్లపై అక్రమణలకు చెక్ .. మున్సిపల్ అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.
ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి
కోదాడ, నేటి ధాత్రి:
ఆపరేషన్ రోప్ లో భాగంగా మంగళవారం కోదాడ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోడ్డు అక్రమణలను తొలగించడం జరిగింది. ట్రాఫిక్ జామ్ లను తగ్గించడం వాహనాల రాకపోకలకు ఆటంకాలు లేకుండా ఫుట్ పాత్ లపై ఉన్న తోపుడుబండ్లను తొలగించి రెడ్ కలర్ మార్జిన్ రెడ్‌లైన్ గీతను ఏర్పాటు చేశారు. రూల్స్ అతిక్రమించి ఈ గీతను దాటిన వారికి చట్టరీత్యా చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
