mamidi pandlatho jagratha, మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి సీజన్‌ వచ్చింది. దోరగా కంటికి ఇంపుగా ఉన్నాయని మామిడి పండ్లను కొని తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. మామిడి పండ్లను అమ్మే వ్యాపారులు మార్కెట్‌లో వ్యాపారాన్ని దష్టిలో ఉంచుకుని పచ్చి మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని వివిధ రకాలుగా మాగబెట్టి ఉంచుతున్నారు. ఇలా ఒక్కరోజు పచ్చి మామిడికాయలను ఉంచితే చాలు రెండురోజుల్లో దోరగా పండిన మామిడి పండ్లు రెడీ. వాటినే వ్యాపారులు మార్కెట్లకు తరలిస్తున్నారు. కంటికి దోరగా పండినట్లు కనబడే మామిడి పండ్లను చూసి వినియోగదారులు మోసపోతున్నారు. రసాయనాల ద్వారా మగ్గపెట్టిన మామిడి పండ్లను తీసుకున్న వారికి తొలుత కడుపునొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్‌ సమస్య, విరేచనాలు, వాంతులు మొదలవుతాయి. చివరకు మనిషి పూర్తిగా నీరసించిపోతాడు. తిరిగి కోలుకోవడానికి సెలైన్‌ పెట్టాల్సి రావచ్చు. అంతేకాదు ఈ సీజన్‌ మొత్తం ఇటువంటి కాయలను తీసుకున్న వారిలో పెప్టిక్‌ అల్సర్‌ తలెత్తే తీవ్రమైన ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు అమ్ముతున్న మామిడి పండ్లు సరైనవో…కాదో తనిఖీ చేయాల్సిన అధికారులు జాడ లేకుండా పోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాగా నల్లటి మచ్చలతో పండిన మామిడికాయ దర్శనమిస్తే అది రసాయనాల ద్వారా మగ్గబెట్టిందని తెలుసుకోవాలి. అయితే అన్ని సందర్భాల్లో ఇది నిజమని చెప్పలేమంటున్నారు నిపుణులు.

రసాయనాల పండును ఎలా గుర్తించాలి

రసాయనాలతో పండించిన మామిడి పండు తొక్క, మామిడికాయను తినేటపుడు తేలికగా ఊడిపోతుంటుంది. అదే చెట్టుకే పండిన మామిడికాయ అయితే మంచి సువాసనను కలిగి తినేటపుడు తొక్క కూడా చాలా దఢంగా ఉంటుంది. అదే మధురఫలం. అయితే ఇందులోనూ కల్తీ రాయుళ్లు ఎందరి ఆరోగ్యంతోనో చెలగాటమాడుతున్నారన్నమాట.

మామిడిపండు తింటే ఆరు ఉపయోగాలు

వేసవికాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం…

1. మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్‌ సి ఇంకా ఫైబర్‌ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

2. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్‌ కూడా ధడంగా ఉంటుంది.

3. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం ఇంకా అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.

4. దోరగా పండిన మామిడిలో ఐరన్‌ సమద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్‌ ఎర్ర రక్తకణాల వద్దికి దోహదపడుతుంది.

5. ఈ పండులో వుండే విటమిన్లు, ఇంకా ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. శంగారంలో ఆసక్తి లేనివారికి శంగార వాంఛను కలిగిస్తుంది.

6. మామిడిపండులో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్‌ అనే పదార్దం సమద్దిగా ఉంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

అతిగా తిన్నా ఇబ్బందే

ప్రస్తుతం చాలామంది వ్యాపారులు మామిడి పండ్లను సహజసిద్ధంగా మాగబెట్టడం లేదు. కాల్షియం కార్బైడ్‌ అనే కెమికల్‌ను వాడి ఆర్టిఫిషియల్‌గా మగాబెడుతున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులు లాగడం, తిమ్మెర్లు వంటి రుగ్మతల బారిన పడతారు.

అజీర్తి సమస్య

సరిగా మాగని మామిడి పండ్లను తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు. పచ్చి మామిడిని ఎంత తక్కువ తింటే అంత మంచిది.

చర్మ సంబంధిత వ్యాధులు..

మామిడి పండ్లను విపరీతంగా తినేవాళ్లలో గమనించిన మరో సమస్య అలర్జీ. చర్మంపై బొబ్బలు, సెగగడ్డలు, ఎర్రటి కాయలు వస్తాయి. మామిడి పండ్లు శరీరానికి వేడి చేస్తాయని పెద్దలు అంటుంటారు. అందువల్లే సెగగడ్డలు వస్తాయి.

మధుమేహం పెరుగుతుంది

మామిడి పండ్లలో ఫ్రక్టోజ్‌ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ లెవెల్స్‌ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు. మామిడి పండ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం అని నిపుణులు తెలుపుతున్నారు.

చోద్యం చూస్తున్న మార్కెట్‌ అధికారులు :

వరంగల్‌ పండ్ల మార్కెట్‌లో మామిడి అమ్మకాలు జోరందుకున్నాయి. మార్కెట్‌ ఆదాయాన్ని పెంచడంలో దష్టి పెట్టిన అధికారులు మామిడి పండ్లు రసాయనాలతో మాగబెట్టి తీసుకువస్తున్న దళారులపై చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు రసాయన ద్రవ్యాల నియంత్రణపై దష్టి సారించాలని మామిడి ప్రియులు కోరుతున్నారు. దళారులకు అడ్డాగా పండ్ల మార్కెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డాలు వేసి మారుబేరం చేసి మార్కెట్‌ ఆదాయానికి గండి కోడుతున్నారని చెప్పొచ్చు. దళారితనాన్ని నిర్మూలించి మార్కెట్‌ ఆదాయానికి గండి పడకుండా చూడాలని మార్కెట్‌ లైసెన్స్‌ దారులు కోరుతున్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *