వరుసగా ఇద్దరు మృతి, పెద్ద దిక్కులు కోల్పోయిన కుటుంబాలు.
అమాయకులను పొట్టన పెట్టుకునే, రోడ్డుసమస్త పై చర్యలు తీసుకోకుంటే మరిన్ని ప్రాణాలకు నష్టం.
అకాస్మికంగా ఇద్దరు యువకుల మరణం మండలమంతా విషాదం.
మహారాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, కంపెనీపై చర్యలు మృతులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలి. రెండు రాష్ట్రాల ప్రజలు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
పేదరికం బతకనివ్వడం లేదని పని చేసుకుని బతుకుతామని పొట్ట చేతిలో పట్టుకొని సుమారు 20 సంవత్సరాల క్రితం హబీబ్ జాబరీ మంచిర్యాల నుండి తమ టైలర్ వృత్తిని కొనసాగించుకొనుటకు మహాదేవపూర్ కు వచ్చాడు అలాగే షేక్ హైదర్ మహారాష్ట్ర సరిహద్దు ఓ చిన్న గ్రామం నుండి దినసరి వ్యవసాయ కూలీగా పని చేసుకుంటానని రావడం జరిగింది. సుమారు 20 సంవత్సరాల నుండి మహాదేవపూర్ మండల కేంద్రంలో నివసిస్తూ తమ పనులను చేసుకుంటూ పేదరికంలోనైనా సంతోషంగా రెండు కుటుంబాలు తమ పిల్లలతో జీవిస్తున్నారు. సంతోషంగా ఉన్న ఈ రెండు కుటుంబాలకు మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన రోడ్డు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఆదివారం తెల్లవారుజామున షేక్ రహీం, అర్బాస్ జాబురీలు, రెండు రోజుల చికిత్స అనంతరం బుధవారం ఒకరు గురువారం ఒకరు మృతి చెందడం జరిగింది. గురువారం రోజు షేక్ రహీం మృతుదేహానికి మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఖబరస్థాన్ లో ఖననం చేయడం జరిగింది. గురువారం రోజు మరణించిన జాబ్రి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన మంచిర్యాల అబ్రస్థాన్ లో ఖననం చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు.
పోట్టకూటికి వచ్చిన కుటుంబాల కు మహా రోడ్డు నిర్లక్ష్యం కాటేసింది.
అభం శుభం తెలియని హైదర్, హబీబ్, దినసరి కూలీల కుటుంబాలు చేతికి వచ్చిన 20 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలను చూస్తుండగానే నాలుగు రోజుల్లో ఎప్పటికీ కనబరిని విధంగా ఆ తల్లిదండ్రుల నుండి ఆ కొడుకులు దూరమయ్యేలా చేసింది మహారాష్ట్ర నాగపూర్ రోడ్డు నిర్మాణ సంస్థ, ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తూ ఆ రాష్ట్ర పీడబ్ల్యుడి శాఖ తన గుప్పిట్లో పెట్టుకొని రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన రహదారి వందల సంఖ్యలో రెండు రాష్ట్రాలకు చిన్న పెద్ద మరియు భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతున్న క్రమంలో రోడ్డు నిర్మాణం చేసే క్రమంలో భద్రత పరిమాణాలను పాటించకుండా, రోడ్డు నిర్మాణం జరుగుతుంది అన్న విషయాల సూచికల బోర్డులను పెట్టకుండా, రోడ్డు నిర్మాణం పూర్తయిన ప్రదేశం అనంతరం దారి గేట్లను అమర్చకుండా, రోడ్డు నిర్మాణం చేపడుతున్న పరిధిలో రాత్రివేళ వాహనదారులకు రేడియం లైటింగ్ సదుపాయం అమర్చకుండా, రెండు రాష్ట్రాలకు చెందిన అనేక వాహనదారులకు ఆసుపత్రికి పాలు చేసింది, మహారాష్ట్ర సిరివంచ పరిధిలోని అనేక గ్రామాల వాహనదారులు ఇప్పటికీ రోడ్డు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ప్రమాదానికి గురై నేటికీ చికిత్స కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. నిర్మాణ సంస్థ సంవత్సరం దాటినప్పటికీ కూడా ప్రధాన రహదారి పనులు పూర్తి చేయకుండా ఆలస్యం చేయడం వెనుక ఏమిటి ఈ సంస్థ పిడబ్ల్యుడి శాఖ నుండి 24 కోట్ల నిధులతో అంతరాష్ట్ర వంతెన నుండి మొదలుకొని నగరం చౌక్ తో పాటు సిరివంచ ప్రధాన కూడలి వద్ద వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది, సంవత్సరానికి పైబడినప్పటికీ కూడా పనులు అసంపూర్తి జాప్యం ఎందుకు చేస్తుంది, రోడ్డు నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మించే క్రమంలో రహదారి భద్రత విషయంలో జాగ్రత్త పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ కూడా పిడబ్ల్యుడి శాఖ అధికారులు ఇందుకు ఈ సంస్థ పై చర్యలు తీసుకోవడం లేదు అనేది ప్రశ్న. నాగపూర్ రోడ్డు నిర్మాణ సంస్థ పిడబ్ల్యుడి శాఖ నిర్లక్ష్యం తెలంగాణ సరిహద్దు మహదేవ్పూర్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబ యువకుల ప్రాణాలను తీసింది అన్నది వాస్తవం.
అమాయకులను పొట్టన పెట్టుకునే, రోడ్డుసమస్త పై చర్యలు తీసుకోకుంటే మరిన్ని ప్రాణాలకు నష్టం.
ఇక ప్రస్తుతం మహారాష్ట్ర నాగపూర్ రోడ్డు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి ఇప్పటికే అనేకమంది రెండు రాష్ట్రాల వాహనదారులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో తాజాగా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకుల ప్రమాదానికి గురై 48 గంటల్లోనే మృతి చెందడం ఇటు తెలంగాణ సరిహద్దు మండలాలతో పాటు మహారాష్ట్ర సిరివంచ తాలూకాలోని గ్రామాల్లో రహదారిపై రాకపోకల విషయంలో ప్రజలు భయప్రాంతానికి గురికావడం జరుగుతుంది. రోడ్డు నిర్మాణ సంస్థ అర్ధరాత్రి పగలు ఎక్కడి వరకు పని చేపట్టి వదిలిపెడుతుంది, పని పూర్తి చేసి ఏలాంటి సిగ్నల్స్ ఏర్పాటు చేయదు అన్న విషయం వాహనదారులకు తెలిసి పగలు రాత్రి వేళలో రాకపోకల విషయంపై ఆందోళన చెందక తప్పడం లేదు, ఇప్పటికీ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నామమాత్రంగా కాలు, చెయ్యి, శరీరంలో చిన్న చిన్న దెబ్బల వరకు సరిపెట్టుకొని సర్దుకపోయిన దాఖలాలు ఉండేవి, ఆదివారం జరిగిన సంఘటన ఇద్దరు యువకుల మృతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలను చూసిన వాహనదారులు రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు రోడ్డు నిర్మాణం చేసిన ప్రదేశం ఇద్దరు యువకులు వాహనం అదుపు తప్పి పడ్డ డివైడర్ వీడియోలు అంతర్ రాష్ట్ర వంతెన నుండి సిరివంచ వరకు నిర్మాణం చేపడుతున్న రోడ్డు పైన రావడానికి జంకుతున్నారు వాహనదారులు. ఇలాంటి పరిస్థితిలో రోడ్డు నిర్మాణ సంస్థ నిబంధనలు పాటిస్తుందని రెండు రాష్ట్రాల వాహనదారులకు ప్రజలకు నమ్మకం లేకపోవడంతో నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకోకుంటే మరిన్ని ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని తక్షణమే ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ తక్షణమే చర్య తీసుకోవాలని, వీరి నిర్లక్ష్యానికి వత్తాసు పలుకుతున్న పీడబ్ల్యుడి శాఖ అధికారు కు కూడా బాధ్యులుగా చేర్చి
పేదరికం దినసరి కూలీలతో జీవిస్తున్న ఆ కుటుంబాలకు పోషించే దిక్కును కోల్పోయిన ప్రతి కుటుంబానికి పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.