kcr gadde digali, కేసిఆర్‌ గద్దె దిగాలి

కేసిఆర్‌ గద్దె దిగాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు…16 అంటే ఎలాగోలా తంటాలు పడి నయానో…భయానో 16సీట్లను గెలిపించుకుంటారనీ అనుకున్నామని, కానీ ఇలా ఘోరాతిఘోరంగా 16మంది విద్యార్థులను బలి కొంటారని ఎవరూ ఊహించలేదని, కేసిఆర్‌ చరిత్ర అంతా ఇలా నమ్మించి ప్రాణాలు తీసిన చరిత్రేనని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ), తెలంగాణ కమిటీ (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌)) కిషన్‌ వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే తెలంగాణా సాధనకు ఎంతగానో కషి చేసిన ఎంటెక్‌ విద్యార్థిని తంగెళ్ళ శృతిని వరంగల్‌ జిల్లా మొద్దుగుట్ట వద్ద ఎన్‌కౌంటర్‌ పేరిట చంపివేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని అదిష్టించినందుకు ఇచ్చిన బలి అని ఎద్దేవా చేసింది. ఇప్పుడు కేంద్రంలో అధికారం చేసేందుకు 16మంది విద్యార్థులను బలి తీసుకున్నారని విమర్శించింది. ఇదంతా కేసిఆర్‌ పాలనా దక్షతకే నిదర్శనమని, కనుక ఈ హత్యలన్నింటికీ కెసిఆరే భాద్యత వహించి రాజీనామా చేయాలని అన్నిరంగాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఉపాద్యాయులు, యువతీ, యువకులు, ముఖ్యంగా అనేకంగా నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లి తండ్రులు కోరుతున్నారని తెలిపింది. నల్లగొండలో ఎమ్మెల్యేను నిలదీసినట్లుగా అడుగడునా నిలదీయాలని పేర్కొంది. శృతితోపాటు విద్యాసాగర్‌ను, ఖమ్మంలో 12మంది సీపీబాట సంస్థ సభ్యులను కూడా ఎన్‌కౌంటర్‌ పేరుతో ప్రభుత్వం చంపివేసిందని ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *