Warangal Summer Camp & Coach Appointment
ఉమ్మడి వరంగల్ మైనార్టీ స్కూల్ సొసైటీ బాస్కెట్
బాల్ కోచ్ గా నసీరుద్దీన్
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణమైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99 రోజుల యాక్షన్ ప్లాన్) థీమ్: 4;వెల్ఫేర్ వీక్ లో భాగంగా స్ప్లాష్ సమ్మర్ క్యాంప్ తెలంగాణ మైనార్టీరెసిడెన్షియల్ స్కూల్ జక్కలొద్ది వరంగల్ లో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డా.రమేష్ ఆర్ ఎల్ సి డా.జంగా సతీష్,ప్రిన్సిపల్ భిక్షపతి,విజిలెన్స్ అధికారులు అక్బర్ పాషా, మక్బూల్ పాషా లతో కలిసి శనివారం అధికారికంగా ప్రారంభించారు,ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల,భూపాలపల్లి, వరంగల్,హన్మకొండ,జనగాం, వర్ధన్నపేట,మహబూబాబాద్,ఖాజీపేట ల లోని మైనార్టీ స్కూల్ లోని బాలురకు ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు, ఈ క్యాంప్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా బాస్కెట్ బాల్ కోచ్ గా కేసముధ్రం స్టేషన్ కు చెందిన మహబూబాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పి ఈ టి నసీరుద్దీన్ మహ్మద్ ను స్టేట్ మైనార్టీ స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్వర ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ లెవల్ కోఆర్డినేటర్ డా” జంగా సతీష్ నియమించారు,
