AMC Chairman Row in Sircilla
ఏఎంసీ చైర్మన్ అసత్యపు ప్రచారాలు మానుకో ?
– రైతు వేదికలు రైతు బంధు పథకాన్ని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం
– ఏఎంసీ చైర్మన్ మున్సిపల్ చైర్ పర్సన్ కి కౌన్సిలర్ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
– సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, కౌన్సిలర్ సభ్యులు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అధ్యక్షతన శనివారం సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ… మొన్నటి 22వ తేదీన మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన సంఘటనను ఖండిస్తూ మరుసటి రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి ఖండించగా నిన్నటి రోజు ఏఎంసి చైర్మన్ వారి తప్పులను సమర్ధించుకుంటూ అబద్ధపు మాటలతో మమల్ని నిందిస్తూ చేసిన వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు…
అసలు వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంకు అధికారులు 4 గంటల వరకు రావాల్సిందిగా మాకు చెప్పగా మేము ఒక ఐదు పది నిమిషాల తేడాతో కేంద్రానికి చేరుకున్నాము అక్కడ కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి రాకముందే కాస్త హడావిడిగా ఏఎంసీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టి తనే త్వరగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయినా అక్కడ ఏమీ అనకుండా ప్రోటోకాల్ విషయంపై అధికారులతో మాట్లాడి వచ్చాను వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ పై గొడవ పెట్టకపోవడం మా మంచితనం అని అన్నారు.
దాని తర్వాత మళ్లీ రగుడులో కూడ మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని ప్రజా ప్రతినిధులుగా మేము కొబ్బరికాయ కొట్టి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో ఏఎంసీ చైర్మన్ వారి భర్త ఆమెతో వచ్చినవారు అనవసరంగా గొడవ చేయడంతో ఏం గొడవ చేస్తున్నారు ఆపండి గొడవ అని సముదాయించే క్రమంలో అనవసరంగా ఆవేశానికి లోనై ఏఎంసీ చైర్మన్ నువ్వెందుకు అంటున్నావు నీ పళ్ళు రాలగొడతానని నాపై దురుసుగా మాట్లాడి నిన్నటి రోజు వారు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా మేమే తనను అన్నట్టుగా అబద్ధపు మాటలు చెబుతుంది అందుకు కావలసిన వీడియో సాక్షాలు నా దగ్గర ఉన్నాయి అని ఏ ఏం సి చైర్మన్ ముందుగా అనవసరంగా మమ్మల్ని తిట్టింది అని అందుకు తగిన ఆధారాలతో ఉన్న వీడియోలను ప్రెస్ మీట్ లో చూపించడం జరిగింది అన్నారు. ఏఎంసి చైర్మన్ అధికార మదంతో ఈరోజు మాపై అసత్యపు ప్రచారాలు చేస్తుందని ధ్వజమెత్తారు..
మెప్మా ద్వారా నిర్వహించే కార్యక్రమాలలో మున్సిపల్ చైర్ పర్సన్ గా మేము ముందు పాల్గొనేలా ప్రోటోకాల్ ఉంది ఏఎంసీ చైర్మన్ కేవలం గౌరవంగా పిలిస్తే రావాలి కానీ మాపై జులుం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు..
నిన్నటి రోజు వరి ధాన్యం కొనుగోలులో దాన్యం అంటే అన్నపూర్ణతల్లి ఆ తల్లి సాక్షిగా చెబుతున్నాము అనవసరంగా మేము గాని మా ఆయన గాని ఒక్క మాట కూడా చెడు మాట మాట్లాడలేదని మేము ఎక్కడైనా నిరూపించగలం కానీ ఏఎంసి చైర్మన్ అనవసరంగా ఏమి మాటలు అనలేదని నిరూపించగలిగే దమ్ముందా అని సవాలు విసిరారు..
మేము స్థానిక కౌన్సిలర్ ను గౌరవించాలని బూర బాలును ముందుగా కొబ్బరికాయ కొట్టమనడం ప్రజాప్రతినిధిని గౌరవించమనడమే మా తప్పని అన్నారు..
దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు నిజంగా చెప్పాలంటే గుండాలు నన్ను మహిళ అని కూడా చూడకుండ అటు ఇటు తోసి వేస్తూ గందరగోళం చేయగా ఇలా అందరూ గొడవ చేయొద్దని అంటున్న కూడా మీరెవరు అంటూనే ఒక చేతో వీడియోలు తిస్తూనే మరోపక్క గొడవ చేస్తున్నారు అక్కడి కాంగ్రెస్ నాయకులని అన్నారు..
నా మూడో వార్డ్ ప్రజలకు నా సిరిసిల్ల ప్రజలందరికీ ఏఎంసీ చైర్మన్ ఎలాంటిది మున్సిపల్ చైర్మన్ ఎలాంటిది అని తెలుసు అని అన్నారు..
కేవలం మాపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయారని జీర్ణించుకోలేక కడుపులో విషయం పెట్టుకుని మమ్మల్ని ఇలా కించపరచాలని అనుకోవడం సరియైన పద్ధతి కాదని అన్నారు…
ఒకసారి కౌన్సిలర్ గా మున్సిపల్ లో పనిచేసిన అనుభవం నా భర్తకు ఉంది కాబట్టి నా భర్త మున్సిపల్ పరిపాలన విషయంలో నాకు సలహాలు సూచనలు చేస్తూ ఎప్పుడో ఒకసారి ఆఫీసుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి..
మరి నీ భర్త ఎందుకని వ్యవసాయ మార్కెట్ విషయాల్లో యజమాయిషి చేస్తున్నాడని ఆఫీస్ కి ఎందుకు వస్తున్నాడని ప్రశ్నించారు…
నిన్నటి రోజు ప్రెస్ మీట్ ద్వారా అబద్దాలను చెప్పిన నిన్ను రేపటినుండి సిరిసిల్ల ప్రజలు అబద్ధాల స్వరూప తిరుపతిరెడ్డి అని పిలుస్తారని హెచ్చరించారు..
నిన్నటి రోజు జిందం కళా చక్రపాణి నా తల్లిదండ్రుల వయసు అని మాట్లాడావు నీ తల్లిదండ్రులపై ఇలాగే అబద్ధాలు మాట్లాడుతావా ఇలాగే కించపరిచేలా మాట్లాడతావా అని అన్నారు.
ఇకపై మా పైన గాని మా పార్టీ నాయకులపై గాని కార్యకర్తలపై గాని ఇలాంటి అనవసరపు గొడవలు చేస్తూ పార్టీని కానీ మా పార్టీ ప్రజాప్రతినిధులను కానీ నాయకులను గాని అవమానించాలని చూస్తే ఊరుకునేది లేదని దానికి సరైన పద్ధతిలో సమాధానం చెబుతామని గట్టిగా హెచ్చరించారు..
బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని ఏఎంసి చైర్మన్ అన్నారు ఒకసారి మీరు ఈరోజు చైర్మన్ గా ఉన్న మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా అన్ని వసతులతో కట్టించింది కెసిఆర్ ప్రభుత్వంలో అప్పటి ఏఎంసీ చైర్మన్ చక్రపాణి అని అన్నారు. అంతే కాకుండా గత ప్రభుత్వంలో రైతు వేదికలు, రైతు బంధు పథకాన్ని రైతు బీమా పథకాన్ని ఇలా ఎన్నో రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కేసీఆర్ మా బిఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలని అన్నారు..
అనంతరం పార్టీ కౌన్సిలర్ సభ్యులు నాయకులు మాట్లాడుతూ .. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానించేలా ప్రవర్తించిన ఏఎంసీ చైర్మన్ మున్సిపల్ చైర్ పర్సన్ కి కౌన్సిలర్ సభ్యులకు క్షమాపణ చెప్పాలని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు..
