Phil Salt’s Stunning Catches Steal the Show in IPL 2026
ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్
https://youtu.be/VP9JpBuLDY8?si=fh8XgsOFznEJ7aOR
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆరంభం మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: మ్యాచ్ విజయాన్ని నిర్ణయించే వాటిల్లో క్యాచెస్ కూడా ఉంటాయి. ఎన్నో మ్యాచ్‌లు ఈ విషయాన్ని నిరూపించాయి. కొన్ని క్యాచుల కారణంగా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. తాజాగా ఐపీఎల్(IPL) 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అది మరోసారి నిరూపితమయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు. సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అతడు అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికదే ప్రత్యేకంగా నిలిచింది. ఈ క్యాచులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
