Invitation for Srikantha Maheshwara Kalyanam
శ్రీకంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలోని గౌడకులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీకంఠమహేశ్వర స్వామి, శ్రీ సురమాంభాదేవి వారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 27న నిర్వహించనున్న సందర్భంగా టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి ని గౌడ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా గౌడ సంఘ నాయకులు కక్కేర్ల నాగయ్య, కదురు సాంబయ్య, తాళ్లపల్లి భాస్కర్, బురగాని కొమురయ్య, తాళ్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గౌడ కులస్తులు, సంఘ సభ్యులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
