ఆవిష్కరణలు మానవ ఆకాంక్షలచే నిర్దేశించబడాలి
* వ్యవస్థాపకులు అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ . వి . పురుషోత్తం రెడ్డి .
చేవెళ్ల, నేటిధాత్రి :
మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగడేటా ఇంటెగ్రిటీ వెరిఫికేషన్ అండ్ హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ ఎనేబుల్డ్ ఇంట్రుషన్ డిటెక్షన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్ పరిశోధనలో ఎన్ .సవితకు విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ . వి . పురుషోత్తం రెడ్డి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగంలో పరిశోధన దేశాభివృద్ధికి కీలకమని, క్లౌడ్ కంప్యూటింగ్ పరిసరాలలో డేటా సమగ్రత ధృవీకరణ మరియు హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ ద్వారా చొరబాటును గుర్తించడం అనే అంశం పరిశోధనపై సవితను అభినందించారు. సిద్ధాంతంపై డాక్టర్ ఈ . సాయి కిరణ్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. పరిశోధనలు దేశానికి గర్వకారణమే కాకుండా భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదిని ఏర్పరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సెక్రటరీ – కం – కరెస్పాండంట్ సిహెచ్ . సువర్ణ దేవి, డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డాక్టర్. సిహెచ్ . సాత్విక రెడ్డి , వైస్ ఛాన్సలర్ ఆచార్య జి . శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య,
యం. రవీందర్ , డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆచార్య క్రిస్టోఫర్ , డీన్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్య ఏ. రాజు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆచార్య ఎం. జగదీశ్వర్ , పరీక్షల కంట్రోలర్ ఆచార్య బి. రాజేందర్ రెడ్డి , డిప్యూటీ కంట్రోలర్ (పరీక్షల ) ఆచార్య . ఈ . జగదీష్ కుమార్ , విభాగాధిపతి (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) డాక్టర్ ఈ. అరవింద్ రెడ్డి , డాక్టర్ కె . సతీష్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
