Vivek Venkataswamy at Football Championship
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి…
క్రీడల్లో గెలుపోటములు సహజం…
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల్లో గెలుపోటములు సహజమని రాష్ట్ర కార్మిక శాఖ, ఉపాధి కల్పన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న అస్మిత ఖేలో ఇండియా అండర్-16 ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీల బహుమతుల ప్రధానోస్తవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటిల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జట్టు మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో రంగారెడ్డి జట్టు, మూడవ స్థానంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జట్లు నిలిచాయి.

ఈ సందర్బంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడానికి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ దోహదపడతాయని తెలిపారు. ఎంతోమంది క్రీడాకారులను ఉన్నత శిఖరాలను చేర్చుతున్న సింగరేణి ఠాగూర్ స్టేడియంలో క్రీడాకారుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్, సిఐ రమేష్, ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ మధుకుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కట్ట ఈశ్వర చారి, నిర్వాహకులు పల్లె రాజు, ఓడ్నాల శ్రీనివాస్, పిఈటి లు దుబ్బ శ్రీనివాస్, బెల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు.
