BRS Demands Fuel Price Rollback
* ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్య ప్రజల పై భారం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్
:నేటిధాత్రి మొగుళ్లపల్లి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు ధరలను నియంత్రించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్య ప్రజలపై భారాన్ని మోపిందని విమర్శించారు. నిత్యవసరాల ధరలను పెంచి సామాన్య పేద మధ్య తరగతి కార్మిక వర్గాలపై మోయలేని భారాన్ని మోపించిందన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని లేని యెడల ప్రజల ఆగ్రహానికి బలిగాక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు
ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రజలు తక్కువగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగించాలనడం, ఏడాది పాటు బంగారం కొనవద్దని చెప్పడం బాధ్యతారాహిత్య వ్యాఖ్యలుగా ఆయనఅభివర్ణించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ఇంధన ధరల పెంపు మధ్యతరగతి, పేద ప్రజలపై మరింత భారం పడేలా చేసిందన్నారు.సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపే విధంగా పాలన సాగుతోందని ఆరోపించిన దేవునూ రి కుమార్ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు
