పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
భూమిపై మానవ మనుగడ సజావుగా సాగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని జయశంకర్ భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుండి స్థానిక అంబెడ్కర్ చౌరస్తా మీదుగా పర్యావరణ అవగాహన ర్యాలీ సాగింది. జయశంకర్ విగ్రహం నుండి తిరిగి జిల్లా కోర్టు కి చేరింది. ఈ కార్యాక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలంతా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన పెంచుకోవాలన్నారు.
యావత్తు ప్రపంచం పర్యావరణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేటి తరుణంలో ప్రజలంతా మేల్కొని విరివిగా చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు, వాయు కాలుష్యం నిర్మూలించాలని, భూగర్భ జలాలను కాపాడుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జడ్జి అన్నారు.
అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. జయరాం రెడ్డి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. రామచంద్ర రావు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరి సురేష్ ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్ పోక్సో కోర్టు స్పెషల్ పి. పి. విష్ణువర్ధన్ రావు అడిషనల్ పి. పి. రఫీక్ న్యాయవాదులు, పొలిసు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.