Sarpanch Honored for Development
లింగంపేట సర్పంచ్ కు సన్మానం
జడ్చర్ల /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని లింగంపేట గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికై.. కేవలం 3 నెలల వ్యవధిలోనే..పలు అభివృద్ధి పనులతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్న గ్రామ సర్పంచ్ బాలును గ్రామ ప్రజలు శాలువాతో శనివారం సన్మానించారు. పలు వార్డులో ఏళ్ల తరబడి రోడ్డు, అండర్ డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించిన బాలు వెంటనే చర్యలు తీసుకుని ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పవన్ కుమార్ , నాగరాజ్ , అమృత తదితరులు పాల్గొన్నారు.
