Grand May Day Celebrations in Chityala
హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో వెంకట్రావుపల్లి (సి )లో కార్మికులు హమాలి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పుల్ల సమ్మయ్య మేడే దినోత్సవం జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా కార్మికుల దినోత్సవం వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మాజీ ఎంపిటిసి 2 దబ్బేట ఆనిల్ లు పాల్గొని మాట్లాడారు కార్మికులు హక్కుల కొరకు ప్రాణాలను త్యాగం చేసి సాధించారని తెలిపారు. భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో 14 గంటలు ఉన్న పని గంటలను రోజుకు 8గంటలు చేయడానికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. కార్మికుడు తమ హక్కులు సాధించుటకు కొంతమంది అమరులైనారని గుర్తు చేశారు. ప్రతి ఒక్క కార్మికుడు తమకు ఉన్న హక్కులను కాపాడుకొనుటకు కృషి చేయాలని ఆన్నారు . చెమటచుక్కలా విలువలను కాపాడుకుందాం కలసికట్టుగా మన హక్కులపై పోరాడుదామన్నారు. కార్మిక సోదరుల అందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దూడపాక సాంబయ్య హమాలి సంఘం నాయకులు పుల్ల రాజయ్య పుల్లాసదయ్య కనుక సారయ్య పుల్ల మల్లయ్య దబ్బేట భద్రయ్య పుల్ల శైలేందర్ పుల్ల సదయ్య( బంటి) సనిగంటి శ్రీనివాస్ ఆలూరి మొగిలి పుల్ల సారయ్య మాసు కుమార్ పుల్ల అశోక్ పుల్ల రవి మాసు రాములు పుల్ల కుమార్ పుల్ల దేవేందర్ పుల్ల పోశాలు పుల్ల సురేందర్ హమాలీలు పాల్గొన్నారు.
