వీణవంక ,(కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ…
తెలంగాణ స్వరాష్ట్రం కోసం అహర్నిశలు కృషిచేసి ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన తెలంగాణలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేసే దిశగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే మా ప్రియతమ నేత మాలాంటి యువతరానికి ఆదర్శప్రాయ నాయకుడు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడున్న ఈ రాజకీయ క్షేత్రంలో మాకు వేణుదండగా ఉంటూ అండగా నిలిచి ముందుకు నడిపిస్తారని అదేవిధంగా ఆ భగవంతుని ఆశీస్సులు మీపై మీ కుటుంబం పై చూపి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ప్రజల మన్నలను పొందుతూ ప్రజా జీవిత క్షేత్రంలో ఇంకో స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం రాష్ట్ర నాయకులు యరా సుమన్, గడ్డం అజయ్ తిరుపతి శ్రీధర్ జతిన్ వర్మ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.