..తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించిన తనయులు.
.. ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం.
.. రామయంపేట ఎల్లమ్మ గుడి వద్ద కార్యక్రమం నిర్వహణ.
రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామయంపేట పట్టణంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద పట్టణానికి చెందిన బలగం సినిమా మురళీధర్ గౌడ్, అన్నదమ్ములకు వారి యొక్క తనిదులు పాదపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులను మించిన దైవం లేదని వారిని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుందని అన్నారు. మనకు జన్మనిచ్చి పెంచిపెద్ద చేసి ఒక మంచి మార్గంలో నడిపించిన వారిని గౌరవించడం మన బాధ్యత అన్నారు. ఇది ఏదో ఒక ప్రచారం కోసం కాకుండా భవిష్యత్ తరాల్లో తల్లిదండ్రులు వారి విలువ పిల్లలకు గుర్తుండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు, వారి అనుబంధాలు ఆప్యాయతలు, జీవన విధానం నేటి తరానికి కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమం వల్ల కనీసం కొంతవరకైనా మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాలు గౌడ్. ఐ రేమి రవీందర్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్. జబర్దస్త్ యాక్టర్ అభి. తదితరులు పాల్గొన్నారు.