BJP Leader Supports RTC Strike in Parakala
గిరిజన విద్యార్థులకు సువర్ణావకాశం
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ 2026-27 నోటిఫికేషన్ విడుదల
నేటిధాత్రి ప్రతినిధి వరంగల్ జిల్లా:
వరంగల్ జిల్లాలోని గిరిజన విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ 2026-27 విద్యాసంవత్సరానికి “బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్” నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పథకం కింద 3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. అర్హత గల గిరిజన తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.ఈ స్కీమ్‌కు గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 లోపు ఉండాలి. విద్యార్థుల ఎంపిక లాటరీ విధానంలో నిర్వహించబడుతుంది.మొత్తం 32 సీట్లలో 3వ తరగతికి 16 సీట్లు, 5వ తరగతికి 8 సీట్లు, 8వ తరగతికి 8 సీట్లు కేటాయించారు. ఇందులో 33 శాతం సీట్లు బాలికలకు కేటాయించారు. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఉండగా, బాలికలకు ఈ నిబంధన వర్తించదు.దరఖాస్తు ఫారములు హన్మకొండలోని అశోక కాలనీలో అంబేద్కర్ భవనం ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 29 సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను మే 7 సాయంత్రం 5 గంటలలోపు అదే కార్యాలయంలో సమర్పించాలి.
అవసరమైన పత్రాలు:
కుల ధ్రువీకరణ పత్రం,నివాస ధ్రువీకరణ పత్రం,అలాగే ఆదాయం ధ్రువీకరణ పత్రం మీసేవ ద్వారా (01.04.2026 తర్వాత జారీ అయినది),
ప్రస్తుత పాఠశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్,
ఆధార్ కార్డు లతో అందజేయాలని ఈ మేరకు ఐటిడిఏ, ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల పొందుట: ఏప్రిల్ 22 నుంచి 29 వరకు,సమర్పణకు చివరి తేదీ: మే 7 సాయంత్రం 5 గంటల వరకు..
