– దేవాలయాల్లో వరస దొంగతనాలు చేసిన ముఠా
– నిందుతులపై మొత్తం 17 కేసులు
– 8 తులాల బంగారం,2 తులాల వెండి స్వాధీనం
– చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ లు
– వివరాలను వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహజన్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
దేవాలయాల్లో వరస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడ రూరల్ మండలం ఫాజిల్ నగర్ లో ఉంటున్న హుస్నాబాద్ కు చెందిన శివరాత్రి సంపత్, వేములవాడ పట్టణం అగ్రహారం కు చెందిన అల్లిపు పరుశురాము అనే వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో నిందుతులపై మొత్తం 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్ల డిఎస్పి ఆధ్వర్యంలో రూరల్ సీఐ మొగిలి ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సోమవారం రోజున పొత్తూరు బ్రిడ్జి వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 8 తులాల బంగారు అభరణాలు, రెండు తులాల వెండి అభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో దేవాలయాల్లో వరస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ మధు, చంద్రశేఖర్లను జిల్లాఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.