స్నేహితుడి అనారోగ్యానికి స్నేహితులంతా చేయందించి..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
స్నేహితులు అంటే సుఖాల్లో పాలుపంచుకునే వాళ్ళు కాదని, కష్టాల్లో సైతం తోడుండే వాళ్ళని 1992- 93 వ సంవత్సరంలో రామకృష్ణాపూర్ పట్టణం లో గల జడ్పీఎస్ఎస్ బాలుర పాఠశాల లో 10 వ తరగతి విద్యనభ్యసించిన 36 మంది స్నేహితులు నిరూపించారు. అమ్మతోపాటు దిగినభ్యసించిన బాల్యమిత్రుడు వడ్డేపల్లి రాజనర్సయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడనే విషయాన్ని తెలుసుకొని మిత్రులంతా కలిసి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి స్నేహం ఎంత గొప్పదో తెలియజేశారు. తమతో పాటు చదువుకున్న రాజ నరసయ్య ఒంటరివాడు కాదని మేమంతా తన వెంట ఉంటామని తను కోలుకునే వరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. త్వరగా మిత్రుడు కోలుకొని ఇంటికి తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు .
