Haj Pilgrims Vaccination Program Held in Zaheerabad
మాజీ ఛైర్మన్ హజ్ యాత్రికుల టీకా కార్యక్రమంలో పాల్గొన్నారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక సంస్థ మాజీ ఛైర్మన్ మహమ్మద్ తన్వీర్, సోమవారం మధ్యాహ్నం జహీరాబాద్ పట్టణ పరిధిలోని గౌరీ ప్యాలెస్లో మౌజాన్ గౌస్ నాయకత్వంలో 70 మంది హజ్ యాత్రికుల కోసం నిర్వహించిన టీకా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హజ్ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరూ క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని, మన దేశం, తెలంగాణ రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. ఆయనతో పాటు జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనస్, కౌన్సిలర్ మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ జమీల్, మోబిన్, ఆఫీస్ సుబేదార్ మహమ్మద్ బాసిత్, మత పెద్దలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
