Soil Awareness Program Held in Chimiryal
చిమిర్యాల రైతు వేదికలో భూసారంపై రైతులకు అవగాహన.
కోదాడ, నేటి ధాత్రి:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల రైతు వేదికలో రైతు వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మే 4 నుంచి 19 వరకు రైతులకు భూసార పరీక్షలపై అవగాహన,కొత్త రకాల పంటలపై ఆయిల్ ఫామ్ పంటలు లాభదాయకమని ఏఈఓ మహేష్ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ల చేతుల మీదుగా భూసారం పరీక్షలు చేయించుకున్న రైతులకు భూసార వివరాలతో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోరకుంట సర్పంచ్ పాలకి సురేష్, మంగళ్ తండా సర్పంచ్ బాబ్జి నాయక్, కూచిపూడి తండ సర్పంచ్ హాజీ నాయక్, పిఎసిఎస్ సీఈవో జొన్నలగడ్డ కృష్ణ, గ్రామ కార్యదర్శి సైదులు రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
