Financial Aid to Drug Officer’s Family
ఔషధ తనిఖీ అధికారికి కుటుంబానికి ఆర్థిక సహాయం
పరకాల,నేటిధాత్రి
https://youtu.be/GLUE0bKop68?si=kQAVFn7iuHuCS2nZ
ఇటీవల గుండెపోటుతో అకాలమరణం చెందిన పరకాల వాసి,హైదరాబాద్లో ఔషధ తనిఖీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న కీ.శే గుండు శ్రీకాంత్ కుటుంబాన్ని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గుండమీది కోటేశ్వరరావు ఆదివారం పరామర్శించారు.పరకాలలోని శ్రీకాంత్ స్వగృహాన్ని సందర్శించిన ఆయన,మృతుని తల్లిదండ్రులు,సోదరుడు, భార్య శ్రీలక్ష్మి,పిల్లలను ఓదార్చి,అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా 2లక్షల చెక్కును,పల్లవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 25 వేల ఆర్థిక సహాయాన్ని శ్రీలక్ష్మికి అందజేశారు.అదనంగా తోటి అధికారుల సహకారంతో సుమారు 15 లక్షలను పిల్లల భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసీఓఐడబ్ల్యూఏ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.నాగరాజు,మాజీ జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్.వెంకటేశ్వర్లు,కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మృత్యుంజయ రెడ్డి,ఆర్.శ్రీనివాస్,పావుశెట్టి వెంకటేశ్వర్లు,కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
