Join Children in Government Schools
పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి చక్కగా చదివిస్తాం
రాయికల్ మే 18. నేటి ధాత్రి:
కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుందని,తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమనాతి లక్ష్మయ్య అన్నారు.సోమవారం రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామంలో విద్య వారోత్సవాలు బడిబాట కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న పని ప్రదేశానికి వెళ్లి తమ పిల్లలను ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత పుస్తకాలు,దుస్తులు,మధ్యాహ్న భోజన పథకం,తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.అనంతరం కూలీలకు ఉపాధ్యాయులు ఎండ వేడిమిని నుండి ఉపశమనం పొందడానికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నల్లాల స్వామి,జడ్పీహెచ్ఎస్ ఆలూరు ప్రధానోపాధ్యాయులు భీమనాతి లక్ష్మయ్య,ఉప సర్పంచ్ సల్ల మహేష్, ఉపాధ్యాయులు ఆకు రమేష్,కురిమిళ్ళ మల్లేష్,వార్డు సభ్యులు వేల్పుల జీవరత్నం,నల్లాల శేఖర్,చిలుక సంజీవ్,ఫీల్డ్ అసిస్టెంట్ గాజెంగి నర్సయ్య,కూలీలు తదితరులు పాల్గొన్నారు.a
