Turk Kasha Sangham New Committee Elected in Ainavolu
తుర్కకాశ సంఘం నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా ఇమామ్ ఉపాధ్యక్షులుగా ఎస్కే మున్న
నేటి ధాత్రి అయినవోలు
అయినవోలు మండలం లింగమొరిగూడెం గ్రామంలో మంగళవారం తుర్క కాశ సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా ఎం.డి. ఇమామ్‌ను, ఉపాధ్యక్షుడిగా ఎస్కే. మున్నాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుడిగా ఎస్కే. మదర్ (చంటి)ను, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే. చిన్న మదర్‌ను నియమించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంఘ ఐక్యత, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.A
