సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ( ఈస్టర్) పండుగ
నేటి ధాత్రి/ భద్రాచలం
స్థానిక సీఎస్ఐ చర్చిలో మట్టల పండుగను ఆదివారంఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు ఈత మట్టలతో ప్రత్యేకంగా ఆకర్షణంగా కనిపించాయి భక్తులు ఈత మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ చర్చి చుట్టూ తిరిగారు అనంతరం చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఏసుప్రభు జెరుసలెం పట్టణంలో ప్రధమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు ఏసు ప్రభువును గాడిద పై తీసుకొని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల ఈత మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు దీనినే క్రైస్తవులు మట్టల ( ఈస్టర్) పండుగగా ఆచరిస్తారు ఈ సందర్భంగా పాస్ట్రేట్ ,& గ్రూప్ చైర్మన్ రేవ , కె . టీ .విజయ్ కుమార్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ గడిదేసి సాల్మన్ , పస్ట్రేట్ & గ్రూప్ సెక్రెటరీ, రితీష్ రెడ్డి, ట్రెజర్ , వై .ప్రసాద్ రావు, మరియు కమిటీ సభ్యులు జోసెఫ్ కుమార్ ,రాజు రవికిషోర్ ,మధు సంతాయ్య. పాల్గొన్నారు