అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శం
కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సమ్మయ్య
జైపూర్,నేటి ధాత్రి:
భీమారం మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్ రోడ్ చౌరస్తాలో సోమవారం ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సంపత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంతెన సమ్మయ్య మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహం స్థాపన కొరకు ఆరట పడుతున్నామని చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి విన్నవించారు.అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శమని,సమాజంలోని అసమానతలు దురహంకారం పై అలుపెరుగని పోరాట యోధుడు,సమ సమాజ స్వప్నికుడు.దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్త జాతీయవాది అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అన్ని గ్రామాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.అంబేద్కర్ ఏ ఒకరికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని సమాజంలోని ప్రజలందరీ వాడని ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన వ్యక్తి ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి జాతీయ ఉద్యమంలో అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటి నుంచి సమాజం ఎన్నో అవమానాలు ఎదురైన వేను తిరగక వాటిని ధైర్యంగా ఎదుర్కొని తన కృషితో కేంద్ర మంత్రి పదవి పొందారు.అంబేద్కర్ జీవిత కాలంలో అనేక సబ్జెక్టులలో 32 డిగ్రీలు పొంది గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడుగా నిలిచారన్నారు.విద్యాభ్యాసం తర్వాత ఆర్థికవేత్తగా,ప్రొఫెసర్ గా,న్యాయవాదిగా కొనసాగారు.స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసి పేద వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి అంబేద్కర్ తన జీవిత చివరన బుద్ధుని బోధనలు నచ్చి బౌధమతం స్వీకరించారు.మహిళా హక్కులు,కార్మికుల హక్కులు ఇతర అన్ని వర్గాల పేద ప్రజల కోసం తన జీవితకాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా ఈ సమాజం చూడాలని ఎవరు తక్కువ చేసి చూడకూడదని సూచించారు.చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమారం మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.