Tributes to Rajiv Gandhi
దేశ ప్రగతికి బాటలు వేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…
రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం….
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దేశ ప్రగతికి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ బాటలు వేశారని క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్ అన్నారు.రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో ఇందిరమ్మ స్ఫూర్తితో రాజీవ్ గాంధీ పని చేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు. ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీపడేలా దేశాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. దేశానికి సాంకేతికతను పరిచయం చేసి, ఆధునిక హంగులు అద్దిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దాముక శిరీష, గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్ , మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, మాజీ బ్లాక్ అధ్యక్షులు గోపతి రాజయ్య, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, పట్టణ ఉపాధ్యక్షులు పనాస రాజయ్య, కాసర్ల ప్రకాష్, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, మంద సృజన, ప్రధాన కార్యదర్శులు గోపు రాజం, మేకల శ్రీనివాస్, ఏల్పుల సత్యనారాయణ, ఎర్రబెల్లి రాజేష్, అధికార ప్రతినిధి మాదాసు రాజ్ కుమార్, కార్యదర్శులు కునారపు శివ, నర్రా శ్రీనివాస్, గోళ్ల మల్లేష్, రాజేశ్వరి, కొండవేణ పుష్ప, దీప, అనూష తదితరులు పాల్గొన్నారు.
