Ramzan Ration Kits Distributed to the Poor
రంజాన్ రేషన్ కిట్లను, బట్టలను పంపిణీ
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :.
పండగలు మాత సామరస్యాలకు అతితంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ సర్పంచ్ ఎద్దు నగేష్ యాదవ్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గురువారం తుంకుంట లోని అక్సా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహబూబ్ జానీ తో కలసి మున్సిపల్ సిబ్బందికి, పేద ప్రజలకు రంజాన్ రేషన్ కిట్లను, బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పవిత్ర మాసమైనా రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ అబ్దుల్ రెహమాన్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, కృష్ణారెడ్డి, ఈశ్వర్ గౌడ్, రాజు యాదవ్, మధుసూదన్ రెడ్డి, దావూదీయ మస్జిద్ అధ్యక్షుడు బాబా, కమిటీ సభ్యులు మహమ్మద్ ముదస్సిర్ కైరా ఫౌండేషన్ చైర్మన్ వచ్చారు. ఈ కార్యక్రమంలో 150 మంది పేదలకు, మున్సిపల్ సిబ్బందికి రేషన్ కిట్లను, చీరలను పంపిణీ చేశారు.
