DCP Visits Kommala Cattle Market
కొమ్మాల పశువుల సంతను సందర్శించిన డీసీపీ
గీసుకొండ, నేటిధాత్రి:
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మామునూరు ఏసీపీ వెంకటేష్ తో కలిసి మంగళవారం కొమ్మాల పశువుల సంతను సందర్శించి అక్కడ జరుగుతున్న వ్యాపార విక్రయాలను పరిశీలించారు. వ్యాపారులు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అనంతరం గీసుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్లో నమోదైన ఫిర్యాదులు, వాటి పురోగతి, కేసుల దర్యాప్తు, అరెస్టుల వివరాలను సమీక్షించారు.ఈకార్యక్రమంలో గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై అనిల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
