ప్రజలారా కథం కథం తొక్కి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం
-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛలో వరంగల్ సభను విజయవంతం కొరకు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్య టిస్తున్నారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయ ప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27 నాడు కెసిఆర్ ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటు వంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్త యి 25వ సంవత్సరాల్లో అడు గుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వ హించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం.

భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించ లేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవాసభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటు వంటి ప్రభుత్వాలు ఉండవు, దానికి కారణమేంటంటే అమ లు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నటు వంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికా రంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపా లన, అసమర్ధ పరిపాలన, చేత గాని వ్యవహారం ఇవన్నీ చేసు కుంటుప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి.
ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ ఎస్ జెండానే గెలిచేది బిఆర్ ఎస్ అభ్యర్దులే.
ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.