Demand ₹25 Lakh Ex-Gratia for Farmer Family
రైతు గాజుల వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
నెక్కొండ, నేటి ధాత్రి:
చెందిన రైతు గాజుల వెంకటేశ్వర్లు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో మృతి చెందిన ఘటన బాధాకరమని అఖిల భారత రైతు కూలీ సంఘం, తెలంగాణ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. మృత రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
వెంకటేశ్వర్లు నాలుగు ఎకరాల్లో సాగు చేసి, వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రానికి తరలించినప్పటికీ 15 రోజులుగా కొనుగోలు జరగక తీవ్ర మనోవేదనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందనే ఆందోళనతోనే ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరత, లారీల ఆలస్యం, కాంటాల్లో అవినీతి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా పథకానికి ఉన్న వయో పరిమితిని ఎత్తివేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
