TJS Marks 8 Years of People’s Struggle
8 ఏళ్లుగా ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
*టిజెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ *
తెలంగాణ జన సమితి 8వ ఆవిర్భావ దినోత్సవం
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ అన్నారు.నర్సంపేటలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ పార్టీ జెండాను ఎగరవేశారు.అనంతరం అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ జన సమితి 8 ఏళ్లుగా జనం పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ నిలదొక్కుకున్న పార్టీగా ఎదుగుతోందన్నారు. డబ్బే కేంద్రంగా మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై గొంతెత్తిన పార్టీగా జన సమితి ప్రత్యేకతను చాటుతోందన్నారు.
గత ఎనిమిదేళ్లుగా ఆదివాసులు, రైతులు, నిరుద్యోగులు, కార్మికుల ప్రజా సమస్యల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రధాన అజెండాగా తెలంగాణ జన సమితి పార్టీ పేర్కొంటోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావీద్, రాష్ట్ర కమిటీ సభ్యులు గుంటి రామచంద్ర, మెహబూబ్ అలీ, మహమ్మద్ సందాని, గుంటి సంజీవ, మహమ్మద్ ఆసిఫ్, అక్రం, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
