ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా పని చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో కమ్యూనిస్టు సిపిఐ పార్టీ బలోపేతానికి నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం సిపిఐ పార్టీ కౌన్సిలర్ నూకల భూలక్ష్మి చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ నాయకులకు భవిష్యత్ కర్తవ్యాలపై దిశా నిర్దేశం చేశారు. ముందుగా ఇటీవలే అకాల మరణం చెందిన వారికి సంతాపాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో 11 మండలాల్లో పార్టీ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై పని చేయాలని అన్ని మండలాల్లో పార్టీ ప్రజాసంఘాల కమిటీలు వేయాలన్నారు. ప్రజా సంఘాల కార్మిక సంఘాల తోనే పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని, పోటీ చేసే వ్యక్తుల గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అట్లాగే పార్టీ సభ్యత్వం 25 శాతం పెంచి వెంటనే పూర్తి చేసి రాష్ట్ర పార్టీకి అందజేయాలన్నారు. సిపిఐ వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు జిల్లా వ్యాప్తంగా సంవత్సరం పాటు నిర్వహించాలని అన్నారు. ఈనెల 24న భగత్ సింగ్ కాలనీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు హాజరుకానున్నారని కావున పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మోటపలుకుల రమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ, క్యాతరాజు సతీష్, జిల్లా సమితి నాయకులు రమేష్ మామిడాల సమ్మిరెడ్డి, పెంట రవి, అన్నారపు రాజేందర్, మాతంగి రామచందర్,ఎం విజేందర్ జి శ్రీనివాస్, నబి, రాజయ్య, కుమారస్వామి, కుడుదుల వెంకటేష్, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!