పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అందజేసిన ఎస్సై.
చిట్యాల, నేటిదాత్రి :
ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు తిరిగి అందజేయడంలో చిట్యాల పోలీసులు మరోసారి విజయం సాధించారు. గురువారం చిట్యాల పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రావణ్ కుమార్ రికవరీ చేసిన నాలుగు మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే:
వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సి ఈ ఐ ఆర్ పోర్టల్ కానిస్టేబుల్ లాల్ సింగ్, ఆ ఫోన్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ట్రాక్ చేశారు. రికవరీ అయిన ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
సర్వ శరత్ కుమార్ (నవాబుపేట): వివో T5 ప్రో (ఆగస్టు 2024లో పోగొట్టుకున్నారు)
అనుప మహేష్ (నవాబుపేట): రెడ్మి నోట్ 12 ప్రో
దువ్వల ప్రవీణ్ (నవాబుపేట): ఒప్పో మొబైల్
మేకల గణేష్ (శాంతినగర్): ఒప్పో మొబైల్
ఈ సందర్భంగా ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే అధైర్యపడకుండా పోలీస్ స్టేషన్లో లేదాసి ఈ ఐ ఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో మొబైల్ ఫోన్లను సులభంగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు. ఎవరికైనా ఇతరుల మొబైల్ ఫోన్లు దొరికితే వెంటనే పోలీసులకు అప్పగించాలని, వాటిని అక్రమంగా వినియోగించడం నేరమని హెచ్చరించారు.
తమ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు ఎస్సై మరియు కానిస్టేబుల్ లాల్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు.
