తంగళ్ళపల్లి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్థానిక తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ కి రెడ్డి కుల సంఘం సభ్యులు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సందర్భంగా మాట్లాడుతూ మొన్న రెండు తారీకు నాడు జరిగిన బిసి బహిరంగసభలో పాల్గొని రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెడ్డి కులం వారు బీసీల ఉచ్చ తాగుతున్నారని రెడ్డి సామాజిక వర్గం తలదించుకునేలా అసభ్య పదజాలం వాడారని కక్షపూరితంగా మాట్లాడారని ఇతర బహిరంగ సభలపై వేదికలపై కూడా కూడా రెడ్డి కులస్తులను కించపరిచే విధంగా మాట్లాడారనిరెడ్డి సామాజిక వర్గ ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఉన్నాయని రెడ్డిల పైన ఇతర కులస్తులు దాడులు చేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని దీనివల్ల తెలంగాణలో అభద్రత వాతావరణం ఉంటుందని సమాజంలో ఇతర కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయని తెలియజేస్తూ గౌరవ ప్రధానమైన పట్టుభద్రుల పదవిలో ఉండి ఎమ్మెల్సీ గా ఎన్నికైన ప్రజలు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు స్వేచ్ఛను కాలరాసే విధంగా వాక్యాలు ఉన్నాయని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను వెంటనే శాసన సభ మండల నుండి బర్తఫ్ చేసి రెడ్డి సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ నుండి బహిష్కరించాలని ఈ సందర్భంగా రెడ్డి సంఘం తరఫున ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ అన్నారు.గురువారం చండూరు మండల కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరసనగా సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ ఆదానీ , అంబానీలకు మేలు చేసే విధంగా ఉందని, ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ శక్తులు దేశ ప్రయోజనాలను, బడ్జెట్ ను తమకు అనుకూలంగా నిర్ణయించే స్థాయికి మోడీ ప్రభుత్వం దిగజారిందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్లోవిద్య, వైద్యంపై బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని, అత్యధికంగాపేదలకు ఉపయోగపడే ఉపాధి హామీలో నిధులను పూర్తిగా తగ్గించి పేదల నోట్లో మట్టి కొట్టిందనివారు ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, కూటమి భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు తప్ప మిగతా రాష్ట్రాలకుకేటాయించలేదని, బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన 63 వేల కోట్లు మాత్రమే ఉన్నదని, ఇంకా అదనంగా పెంచలేదని సంవత్సరానికి 200 పనిదినాలు పెంచుతూ రోజుకు కూలి 600 రూపాయలు ఇవ్వాలనిఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపైన కనీస మద్దతు ధర పైన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వంవిఫలమైందన్నారు.ఒక దేశ ప్రధానిఇది పేదల బడ్జెట్ అని చెప్పటం ఎంత మోసపూరితమైన కుట్ర అని అర్థమైతుందన్నారు. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే రైలు సింగిల్ లైన్ కారణంగా నాలుగు ఐదు గంటల సమయం పడుతుందని అందుకని అనేక సంవత్సరాలుగా డబల్ ట్రాక్ ఏర్పాటు చేయాలి తెలుగు ప్రజలు కొట్లాడుతున్న ఆ ఉసే బడ్జెట్లో ఎత్తలేదని, మరి బిజెపి ఎంపీలు ఏం చేస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలనిఆయన అన్నారు.కేంద్ర మంత్రినిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మోకారిల్లె బడ్జెట్ లా ఉందని, విద్య వైద్యాన్ని విస్మరించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం నాయకులుఈరటి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బల్లెం స్వామి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులుకత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, బి పంగి నాగరాజు, రమేష్, అలివేలు, చంద్రమ్మ,కలమ్మ, ముత్తమ్మ,పెద్ద వెంకన్న,దానయ్య,కృష్ణయ్య,జంగమ్మ, బక్కమ్మ, లక్ష్మమ్మ, రేణుక,రజిత,ఎల్లమ్మ,యాదయ్య, రామచంద్రం, నరసింహ, రాము,హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నగేష్, నరేష్, సుమన్, శేఖర్, నరసింహ, జానీ, బిక్షం, చిరంజీవి, సత్యనారాయణ, సత్తయ్య, శ్రీను, అంజి, రమేష్, కుమార్, సురేష్ దితరులు పాల్గొన్నారు.
అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్.
కారేపల్లి నేటి ధాత్రి
సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కారేపల్లి మండలం పేరుపెల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం వై ప్రకాష్ మాట్లాడుతూ బిజెపి మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కార్మికుల నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాదిమంది రైతుల కార్మికులతో 13 నెలల పాటు సాగిన వీరోచిత ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో 800 మంది అమరులైన ఉద్యమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్యమానికి దేశ ప్రజలకు క్షమార్పణలు చెప్పి రైతులకు కార్మికులకు నష్టదాయకమైన చట్టాలను రద్దు చేస్తానని ఎం ఎస్ పి పంటల గిట్టుబాటు ధర చట్టం అమలు చేస్తానని పార్లమెంట్ సాక్షిగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి వాటిని రద్దు చేయకుండా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి తిరిగి అట్టి చట్టాలను మరల దొడ్డి దారిన ప్రవేశపెట్టి అమలకు పూనుకున్నాడని ఎన్నో త్యాగాలతో సాధించుకున్న రైతు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ దేశంలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ పరిశ్రమలను భూములను బహుళ జాతి కంపెనీలకు బడ పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టినాడని దీని మూలంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గురి అయ్యి బజారున పడి పరిస్థితికి వచ్చిందని సాధించుకున్న హక్కులను చట్టాలను కాపాడుకొనుటకై అన్ని వర్గాల ప్రజలు ఐక్యమై ఉద్యమించాలని అందులో భాగంగా ఎస్ కే యం ఆధ్వర్యంలో ఈనెల 26న ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగే నిరసన ధర్నా కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ మండల నాయకులు అలెం గురవయ్య చంద్రయ్య బైరుమల లక్ష్మయ్య వై జానకి సుగుణ కోటక్క మంగమ్మ నాగేశ్వరరావు కోటయ్య సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అస్సాం స్టేట్ డిబ్రుగర్ లో 24th అక్టోబర్ నుండి జరుగుతున్న అండర్13 ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 లో హైదరాబాద్ మణికొండ లో “మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ” కి చెందిన క్రీడాకారిని “శాన్వీ లట్టాల” అద్భుతమైన ఆటతో మెయిన్ డ్రా కి అర్హత సాధించింది.
చివరి రౌండ్ లో అస్సాం క్రీడాకారిని తనిస్క్ గొనవర్ మీద వరుస సెట్స్ లో 15/11,15/13 గెలుపొందింది
అతి చిన్న వయసులో అంటే 9 సంవత్సరాల “శాన్వి లట్టాల” అండర్13 అల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ లో మెయిన్ డ్రా కి అర్హత సాధించి రికార్డ్ సృష్టించింది.
ఈ సందర్భంగా “శాన్వి లట్టాల” ని మ్యాచ్ పాయింట్ చైర్మన్ మరియు హెడ్ కోచ్ “వేణు ముప్పాల” భవిష్యత్తు లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని ఆశీర్వదించారు.
“శాన్వి లట్టాల” ఆడుతున్న మొట్ట మొదటి అండర్13 ర్యాంకింగ్ టోర్నీలో నే రెండు ఈవెంట్స్ సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాల్లో మెయిన్ డ్రా కి అర్హత సాధించినది అని అంతర్జాతీయ క్రీడాకారులు JBS విద్యాధర్ మరియు BVSK లింగేశ్వరావు అభినందించారు.
బ్యాడ్మింటన్ లో “శాన్వి” కి మంచి భవిష్యత్ ఉంటుంది అని ఇంటర్నేషనల్ అంపైర్ సంపతిరావు, సూరిబాబు అన్నారు.
మహారాష్ట్ర,జార్ఖండ్ ,డిల్లీ వశం కోసం తీవ్ర ప్రయత్నం.
అధిష్టానం ఎన్నికల పరుగులు.
తెలంగాణలో పదవుల కోసం నాయకుల ఎదురుచూపులు.
క్యాబినెట్ బెర్తుల కోసం పడిగాపులు.
పది నెలలైనా ఊరిస్తూనే ఉన్నారు.
రోజు రోజుకూ ఆశావహులు పెరుగుతున్నారు.
అడుగడుగునా ఎదురౌతున్నా అడ్డంకులు.
అదిగో…ఇదిగో అంటూ అపుడప్పుడు వార్తలు
అధిష్టానం ఎన్నికలలో బిజీ బిజీ.
త్వరలో మరో మూడు రాష్ట్రాలలో ఎన్నికలు.
అధిస్టానం ఎవ్వరినీ రానివ్వడం లేదు .
సీఎం,రేవంత్ రెడ్డి మాట తప్ప ఎవరి మాట వినడం లేదు.
రేవంత్ ముందు అడిగే ధైర్యం ఎవరికీ లేదు.
రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరికీ మాటివ్వలేదు.
అన్నీ ఊహాగానాలే, ఆశావహుల మనుసులో ఆందోలనలే.
ఇప్పుడు విస్తరించినా ఒరిగే ప్రయోజనం లేదు
ఆలస్యమైనా వచ్చే ఇబ్బందేమీ లేదు.
తేనెతుట్టెను కదపాలని రేవంత్ అనుకోవడం లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో వున్నట్టు కనిపించడం లేదు. మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే ముహూర్తం! అనే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్లిన ప్రతిసారీ మంత్రి వర్గం విస్తరణపై వార్తలు రావడం సర్వసాధారణమైపోయింది. నిజంగానే అలాంటి విషయం వుంటే పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడుతాయి. మీడియా అత్యుత్సాహం మూలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూడడం ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో ఉసూరుమనడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలైపోయిన తర్వాత ఈ వార్తలు ఊపందుకున్నాయి. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే మంత్రి వర్గం విస్తరణ వుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కాకపోతే అప్పటికే పిసిసి మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ముందు పిసిసి పదవి ప్రకటించే అవకాశం వుందన్న లీకులు వినిపించాయి. అప్పుడు అవి నిజమయ్యాయి. అయినా అక్కడ కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపించింది. నిజానికి ఆ సమయంలో రేవంత్ రెడ్డికి పోటీగా మరో పవర్ స్టేషను ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలలో ఇది ముఖ్యమైనది. ముఖ్యమంత్రి ఎవరుండే, వారికి వ్యతిరేక వర్గం పిసిసి కమిటీ వుండేది. దాంతో ఆధిపత్య రాజకీయానికి అవకాశం వుండేది కాదు. రెండు పవర్ సెంటర్లు వుంటే రెండు గ్రూపులు తమ కనుసన్నల్లో వుండేలా అధిష్టానం ప్లాన్ చేసిది. ఇప్పుడు అలాంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలు చేయడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని ముందుకు నడిపే నాయకుడి మీదనే పూర్తి బాధ్యత పెడుతున్నారు. లేకుంటే లుకలుకల మూలంగా మొదటికే మోసం వచ్చే పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో వున్న నాయకులు అభద్రతా భావానికి గురౌతున్నారు. అందుకే రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా రేవంత్ రెడ్డి నిర్ణయాలనే అమలు చేయడానికి అధిష్టానం ఇష్టపడుతోంది. ఇతర నాయకుల పప్పులు ఉడకడానికి అవకాశం లేకుండా పోయింది. పిసిసి విషయంలో కూడా అదే జరిగింది. రేవంత్ రెడ్డి మాటే చెల్లుబాటైంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహిడుగా పేరున్న నిజామాబాదు మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ను కాదని అదే జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేశారు. మంత్రి వర్గ విస్తరణ, కూర్పు మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే వదిలేసినట్లు తెలుస్తోంది. అందుకే అధిష్టానం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వడం లేదు. ఎవరినీ ప్రోత్సహించడం లేదు. ఈ వారం రోజుల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సార్లు డిల్లీ వెళ్లారు. ఇప్పుడు కూడా డిల్లీలోనే వున్నారు. అధిష్టానం రెండు రాష్ట్రాల ఫలితాల మీద ఉత్కంఠగా వుంది. ఇలాంటి సందర్భంలో మంత్రి వర్గ విస్తరణ గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. అందుకే అందుతున్న సమాచారం మేరకు క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఉత్తరాధిన కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. హర్యానా, కశ్మీర్ చేతికి చిక్కే అవకాశంపై ఎగ్జిట్ పోల్స్‌గా ముక్త కంఠంతో ఒకే ఫలితాలు అందిస్తున్నాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా రెండు రాష్ట్రాలలో బిజేపి గెలుస్తుందన్న ఫలితాలు ఇవ్వలేదు. హర్యానాలో ప్రముఖ నాయకుడు ఎన్నికల చివరి రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక త్వరలో మూడు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా ఇదే జోష్ మీద ఎన్నికల యుద్ధం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్, డిల్లీ వశం కోసం తీవ్ర ప్రయత్నం చేసే ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్న సమయంలో తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ప్రస్తావనే రాకపోవచ్చు. అయినా తెలంగాణలో మళ్ళీ మంత్రి వర్గం విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. డిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మంత్రి వర్గ కూర్పు పూర్తి చేసుకొస్తారన్న ఆశాభావం మళ్ళీ ఆశావహుల్లో మొదలైంది. తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రి వర్గం కొనసాగుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అందరూ వాటిని కొట్టిపారేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ విషయాన్ని దాచుకోరు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. సహజంగా రాజకీయ నాయకులు ఔనంటే కాదన్నట్లు, వుందంటే లేదన్నట్లు అనే రాజకీయమే ఎక్కువగా వుండేది. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తర్వాత కేసిఆర్ అయినా ఏదీ ముక్కుసూటిగా చెప్పేవారు కాదు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా చెప్పడమే అలవాటు. ఎందుకంటే ఎన్నికల ముందైనా, అంతకు ముందైనా తన మనసులో వున్నదే బైటపెట్టడమే అలవాటు. డొంక తిరుగుడు సమాధానాలు ఆయన నోట ఎప్పుడూ రావు. ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చారో అప్పటి నుంచి ఇతర నాయకులకు భిన్నమైన శైలినే ఆయన అనుసరిస్తూ వస్తున్నారు. అందుకే ఈ తరానికి ఆయన నచ్చుతున్నారు. ముఖ్యంగా సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం వరకు రాజకీయాలు వేరుగా వుండేవి. ఏ మాట చెప్పినా నర్మగర్భంగా మాత్రమే చెప్పేవారు. ఆత్మ విశ్వాసాన్ని కూడా పదిలంగా బైటపెట్టేవారు. ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనా చేద్దాం..చూద్దాం.. పరిస్థితులు ఎలా వుంటాయో ఆలోదిద్దామని దాట వేసేవారు. చేయాల్సింది చేసేవారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అలాంటి సమాధానాలు ఊహించలేం. తన మనసులో వున్నది వున్నట్లు చెప్పేస్తారు. ఆ ముక్కు సూటి తనమే రేవంత్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టినా, లక్ష్యసాధనకు ఉపయోగపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసిన సందర్భంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు? అని ప్రశ్నించిన ప్రతి సారి అధిష్టానం నిర్ణయం ఫైనల్ అనే వారు. ఆ సమాధానం అందరికీ తెలుసు. అయినా ఆయన అదే చెప్పేవారు. పాదయాత్ర చేసినా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే ధైర్యం ఏనాడు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నేనే ముఖ్యమంత్రి అనే నమ్మకంతోనే పార్టీని నడిపించారు. అధిష్టానానికి భరోసా కల్పించారు. నిజం చెప్పాలంటే అలా అధిష్టానానికి భరోసా కల్పించిన నాయకుడు తెలంగాణలో మరొకరు లేరు. నేను కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తా! నాకు పూర్తి స్వేచ్చనిస్తే నేనేంటో చూపిస్తా!! అని అధిష్టానానికి జంకూ బొంకు లేకుండా చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్ రెడ్డి ఏది చెప్పినా అధిష్టానం జోక్యం చేసుకోవడం లేదు. ఎన్నికల సందర్భంలో కూడా తనకు అనుకూలమైన టీన్‌ను ఆనాడే ఎంచుకున్నాడు. టిక్కెట్లు ఫైనల్ చేయించుకున్నారు. గెలిపించుకున్నారు. మంత్రి వర్గ కూర్పు కూడా పూర్తి ఆధిపత్యం ఆయనే చూసుకున్నారు. పెండిరగ్‌లో వున్న ఖాళీలు తనకు నచ్చిన వారినే ఎంచుకుంటానని కూడా ముందే అధిష్టానానికి సూచించారు. అందుకే తొలి విడతలో పూర్తి క్యాబినెట్ కూర్పు చేయలేదు. అధిష్టానం సూచించిన సీనియర్లును మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఏ సీనియర్ మంత్రి జోక్యం లేకుండా చూసుకోవాలనే అనుకుంటున్నాడు. ఆరుగురికి దక్కే అవకాశంలో కూడా పూర్తిగా తన టీం తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. ఏ మాత్రం సీనియర్లకు అవకాశం కల్పించినా క్యాబినెట్ మీద పట్టుపోతుందని రేవంత్ రెడ్డికి తెలుసు. పైగా ఇప్పటి వరకు కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మంత్రి లేకపోవడం తొలిసారి కావడం విశేషం. త్వరలో జిహెచ్‌ఎంసికి ఎన్నికలు జరగాల్సివుంది. ఆ సమయానికి కూడా మంత్రి లేకపోతే ఇబ్బందికరమే అవుతుంది. అయితే హైదరాబాద్ నుంచి తనకు అనుకూలమైన నాయకుడు ఎవరూ లేరు. పైగా హైదరాబాదు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ఇది కూడా ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ అవకాశం దక్కుతుందన్న ఆలోచనతో తన మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీ గూటికి మళ్ళీ చేరాడు. కానీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు విస్తరణ జరిగినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అవకాశం దక్కకపోవచ్చు. అందుకే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదిలా వుంటే మైనారిటీలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గెలవలేదు. కానీ కొంత కాలం ఆశపెట్టుకున్నాడు. ఇప్పుడు తనకు మంత్రి పదవి రాదని నిర్థారణ చేసుకున్నాడు. అందుకే అందరూ మైనంపల్లి హనుమంతరావు వైపు చూస్తున్నారు. ఇక నిజామాబాదు, ఆదిలాబాదు, రంగారెడ్డి జిల్లాలకు కూడా స్థానం దక్కలేదు. వరంగల్ నుంచి ఇద్దరు మహిళా మంత్రులున్నారు. ఇక్కడి నుంచి మూడు స్థానం కావాలని కోరుతున్నారు. స్టేషను ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాలలో కడియం శ్రీహరి అదృష్టవంతుడు అంటారు. పదవులు ఆయనను వరిస్తూ వచ్చాయి. ఇప్పుడు కూడా అవకాశం రావొచ్చన్న అభిప్రాయం వుంది. ఎమ్మెల్యేల మీద కోర్టు తీర్పును బట్టి అవకాశం వస్తుందా? ఉప ఎన్నికలు వస్తాయా? అన్నది త్వరలో తేలుతుంది. అదే సమయంలో ఒక వేళ కడియం మళ్ళీ గెలిస్తే మాత్రం మంత్రి పదవి ఖాయం. ఇప్పుడున్న వారిలో ఎవరో ఒకరికి పదవీ గండం కూడా వుండడం తధ్యం. ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క విషయంలో రేవంత్ రెడ్డి మార్పును కోరుకోడు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అక్కడ ఎవరికీ అవకాశం ఇవ్వరు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వున్నారు. మంత్రిగా జూపల్లి కృష్ణారావు వున్నారు. అక్కడ కూడా మూడో పదవి వుండకపోవచ్చు. మెదక్ కు నుంచి దామోదర రాజనర్సింహ నర్సింహ మాత్రమే వున్నారు. గత ఎన్నికలలో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గెలిస్తే ఆయన మంత్రి అయ్యేవారు. అందువల్ల మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే హైదరాబాదు నుంచి హనుమంతరావు కా లేక, మెదక్ నుంచి రోహిత్ కా అన్నది తేలాల్సివుంది. కరీంనగర్ నగర్ నుంచి ఇద్దరు మంత్రులున్నారు. నల్గొండ నుంచి ఇద్దరున్నారు. కానీ ఆశావహులు చాలా మంది వున్నారు. తనకు కూడా మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు. కానీ ఇవ్వకపోవచ్చు. ఏది ఏమయినా ఆరుగురు మంత్రులను క్యాబినెట్ లోకి ఇప్పుడే తీసుకోవాలని రేవంత్ రెడ్డికి లేదు. అధిష్టానం ఒత్తిడి చేసి మంత్రి వర్గ కూర్పు తప్పనిసరి అని ఆదేశిస్తే మాత్రం తన అనుకునే వారికే అవకాశం కల్పిస్తారని చెప్పడంలో సందేహం లేదు
ఎస్ ఎస్ యు జెండాను ఊపి ప్రారంభించిన ఎల్తూరి సాయికుమార్ స్వేరో
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్
హనుమకొండ జిల్లా , నేటిధాత్రి.
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు మరియు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అనేకమైనటువంటి సమస్యలు నెలకొన్న సందర్భంగా ఈరోజు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి పోరుయాత్ర అనే పేరిట హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు ప్రతి ఒక్కటి తిరిగి ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అనే ఒక సంకల్పంతోటి ఈరోజు యాత్రను ప్రారంభించుకోవడం జరిగింది. సంక్షేమ హాస్టల్లో మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనము మరియు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆ ఒక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేలా ఈ యాత్రను సెప్టెంబర్ 20నుంచి 30 వ తేదీ వరకు కొనసాగించడం జరుగుతోంది కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విద్యార్థి పోరు యాత్రను విజయవంతం చేయగలరని హనుమకొండ జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గజవెల్లి శ్రావణ్, చెట్టుపల్లి శివకుమార్ ,రవి ,సిద్దు ,అన్వేష్, నరేష్, సాయి, బాబు, మహేష్, తరుణ్ ,మనోహర్ మరియు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ పోలో అమరవీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లతో
భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం రాజు తద్వారా విలీనం
నిజాం ప్రభువుకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం వలన ఈ ప్రాంతం విలీనం అయినది, ప్రజలకు విమోచనం జరిగింది
భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో తో తెలంగాణ ప్రజల మానప్రాణాలను తీయడం విద్రోహం
ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది
భారతదేశమంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం రాజు చేతిలో బందీగా ఉంది. భారతదేశమంతా స్వతంత్ర పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం ఎంచుకొని నిజాం ప్రభువుకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటనలు చేస్తూ పోరాటం ముందుకు సాగించారు. ఆగస్టు 15 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం ప్రభువు చేతిలో ఇంకా బందీగా ఉంది, యావత్ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తుంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు నిజాం నిరంకుషానికి బలైపోతూనే ఉన్నారు, ఒకవైపు సాయుధ పోరాటం వల్ల నిజాం రాజుకు ముచ్చమటలు పటిస్తున్న తెలంగాణ ప్రజలు , రజాకార్లను, దేశ్ ముఖులను ఊర్ల నుండి తరిమికొడుతుంటే, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా వెళుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో సాయుధ పోరాట ప్రభావం చూపెడుతుందని భావించిన భారత ప్రభుత్వం ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి మిలటరీతో తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాదు స్టేట్ ని భారత దేశంలో కలుపుకునేందుకు నిజాం రాజు పై దండయాత్ర చేయడం జరిగింది అలా తీసుకున్న చర్యనే ఆపరేషన్ పోలోగా ఆనాటి భారత ప్రభుత్వం చెబుతుంది. భారత దేశ మిల్ట్రీ హైదరాబాద్ స్టేట్ లో అడుగుపెట్టి నిజాం రాజుకు వ్యతిరేకంగా రజాకారులతో ప్రత్యక్ష యుద్ధం లో దిగారు ఇలా కొన్ని రోజులు సాగినటువంటి ఆపరేషన్ పోలో కి తలోగ్గిన నిజాం ప్రభువు భారత దేశ హోం శాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆనాటి భారత దేశ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం, ఇక్కడ ప్రజల చైతన్యాన్ని గమనించి ఈ చైతన్యమంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కచ్చితంగా వ్యాపిస్తుందని దాని ప్రభావం యావత్ భారతదేశంపై పడుతుందని దానివల్ల భారతదేశం అంతా కూడా కమ్యూనిస్టు దేశంగా మారే అవకాశం ఉందని గ్రహించి ఆపరేషన్ పోలోను చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో ముసుగులో రజాకారులను, సామాన్యులను, ఒక వర్గ ప్రజలను మరియు సాయుధ పోరాటం వీరులను అంతం చేయడం జరిగింది. మరోవైపు చరిత్రకారుల పుస్తకాల్లో తెలంగాణ ప్రజల మానప్రాణాలను ఆపరేషన్ పోలో ముసుగులో దోచేశారని, కుప్పల కొద్దీ శవాలు విలిన తర్వాత బయటపడ్డాయని అనేకమంది మహిళలు మానాలు కోల్పోయారని చరిత్రకారుల పుస్తకాల్లో లిఖించబడ్డాయ, అందుకనే కమ్యూనిస్టులు ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించాయి, మరోవైపు భారతదేశం దీన్ని విలీనం ప్రక్రియగా ప్రకటించి ఇక్కడి ప్రజలను నిజాం నిరంకుశ పాల నుండి విమోచనం చేశామని ప్రకటించడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 యొక్క ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఈ రోజును ఒక ప్రత్యేక దినంగా తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా ఆపరేషన్ పోలో అమరవీరులకు, సాయుధ పోరాట అమరవీరులకు ఇక్కడ ప్రజల త్యాగాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకాకుండా, చరిత్రను చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర పెత్తందారులు , ఆనాటి ముఖ్యమంత్రులు ఇలా చరిత్ర కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతమై 1969లో విద్యార్థి ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా హక్కులను మేము కాపాడుకుంటామని పోరాటం చేశారు ఆనాడు వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలను బలికున్నారు ఆంధ్ర పెత్తందార , ముఖ్యమంత్రులు. ఆ తర్వాత తెలంగాణ వాదం కొన్ని రోజులు మరుగునపడిన 2001 తర్వాత అది రాజకీయ ఉనికిని పుచ్చుకొని మరో ఉద్యమంగా మారింది అలా సాగుతున్న ప్రయాణంలో 2009లో ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగింది వేలాదిమంది ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ప్రపంచ చరిత్రలో త్యాగాలు చేసిన వీరులను చూశారు కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరులను తెలంగాణ ప్రాంతంలోని చూశాను, ఎందుకంటే ఒకవైపు భారత దేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పైన చేస్తున్నటువంటి అణచివేతను తీవ్రంగా ప్రతిఘటిస్తూన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను చూసి కొంతమంది వారి ఆత్మ బలిదానాలు వలన చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయి అనుకున్నారు, అలా చాలా మంది అమరులయ్యారు అలా అమరులైన ప్రతి అమరుడికి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు చివరిగా వివిధ పార్టీలు సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించిన అధికారికంగా సెప్టెంబర్ 17న ఇంతవరకు నిర్వహించలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా ప్రకటించి అధికారికంగా నిర్వహించబోతోంది దానికి తెలంగాణ ప్రజల తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దినోత్సవం రోజున ముందుగా సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమం, మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వీరులకు, ఆపరేషన్ పోలో అమరులైనటువంటి అమాయక ప్రజలకు, వీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలకు సరైన న్యాయం చేసి, ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారి త్యాగాలకు తగిన గుర్తింపుని ఇవ్వాలని వారికి ఉద్యమకారుల పెన్షన్లతో గౌరవించాలని ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల్లో ఇళ్లను కట్టించి ఇవ్వాలని అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పెషల్ కోటను ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రభుత్వానికి ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనాప్పటికీ చరిత్రలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ ఆధిపత్య కులాలు మరియు ఆంధ్ర పెత్తందారులు ముఖ్యమంత్రులు చేసి, అమరవీరుల అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేయడం దుర్మార్గమని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన చరిత్రను ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా పుస్తకాలను రూపొందించి దేశ, విదేశాలకు తెలంగాణ చరిత్రను వ్యాప్తి చెందేలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
ఆర్టికల్ రాసింది: తాడిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు, హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం కన్వీనర్, వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్టెడ్ కాండేట్
– జిల్లాలోని యువత డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలి. మైనంపల్లి….
– వైద్యా కళాశాల అనుభవిజ్ఞులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…..
– దీని వెనుక విశేష కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమాత్యులు దామోదర్ రాజనర్సింహ….
– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెడికల్ యంత్రాంగానికి ధన్యవాదాలు…..
– మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు…..
కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-
బుధవారం మెదక్ మెడికల్ కలశాల మంజూరి సందర్బంగా పీళ్ళికొటాలలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించరు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్ తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ జిల్లాలో యువత ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారయ్యే వేల ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరి చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు జిల్లా కలెక్టర్ కు, అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్ కళాశాల,మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు. జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం పీళ్ళికొటాలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కళాశాల భూమిని శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ పరిశీలించి భవన నిర్మాణాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజనలో భాగంగా మెదక్ ప్రత్యేక జిల్లా అయినా కూడా అంత అభివృద్ధి చెందలేదని జిల్లా అభివృద్ధిలో విద్యా ,వైద్యం సౌకర్యాలు మెరుగు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు వైద్య కళాశాల మంజూరు కావడం దీని వెనక విశేష కృషి చేసిన జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, హెల్త్ సెక్రెటరీ , ధన్యవాదాలు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యాధికారులు ఉండడం స్థానికంగా ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మెడికల్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అంతకుముందు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు రాందాస్ చౌరస్తాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివ దయాల్, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వార్డ్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ అధికారులు , మెడికల్ కళాశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న పాలాయి శ్రీనివాస్ ను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలసి పూల బోకే అందించి శాలువా లతో సత్కరించి అభినందించారు ఛైర్మెన్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛందసంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్,ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు,బెజ్జంకి ప్రభాకర్, ఛాయా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కోట డేవిడ్,జిల్లా వినియోగదారుల మండలి సభ్యుడు నాగెల్లి సారంగం,నర్సంపేట మెడికల్ షాప్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ తంగెళ్ళ రవికాంత్,,స్వచ్ఛంద సంస్థల సభ్యులు చారి,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
ఎండపల్లి,నేటి ధాత్రి కోడి పుంజుల పల్లి అంగన్ వాడి కేంద్రం , లో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, అనువల్ డే వేడుకలలో భాగంగా పలు కార్యక్రమాలు బాల బాలికలను ఆకట్టుకున్నాయి, ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని కోడిపుంజులపల్లి లో నీ అంగన్ వాడి కేంద్రం లో ,అంగన్ వాడి ఉపాధ్యాయురాలు కొప్పుల పుష్పలత ఆధ్వర్యంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ఇసిసిఇ) లో భాగంగా మహిళలు,బాల బాలికలు హాజరై పలు కార్యక్రమాలను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మహిళలు, బాల బాలికలు పాల్గొన్నారు
మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కావటి రజిత అధ్యక్షతసమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో ఎంపీడీవో భాస్కర్, ఎమ్మార్వో ,వైస్ ఎంపీపీ విడిది నేని అశోక్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి చోట మియా, ఎంపీటీసీలు ,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు మండల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ పరిధిలోని ఒంటిప్ప తండ గ్రామంలో గురువారం రోజున భూపాలపల్లి డిఎస్పి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఇందులో భాగంగా సరైన ధ్వపత్రాలు మరియు నంబర్ ప్లేట్లు లేని లేని 24 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు సీజ్ చేయడమైనది, అలాగే 25 లీటర్ల ప్రభుత్వ నిషేధ గుడుంబా మరియు 1700 లీటర్ల బెల్లం పానుకమును ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది, ఈ సందర్భంగా డి.ఎస్.పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయం గనుక ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అలాగే ఎటువంటి సమస్య వస్తే వెంటనే 100 కాల్ చేయగలరని ముఖ్యంగా గ్రామంలో యువకులు, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గంజాయి, గుట్కా,గుడుంబా , గ్యాంబ్లింగ్ లాంటి వాటి దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో చిట్యాల సిఐ డి మల్లేష్ యాదవ్, చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్, రేగొండ ఎస్సై రవికుమార్, టేకుమట్ల ఎస్సై ప్రసాద్ ,చిట్యాల సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ బృందం పాల్గొన్నారు.
మహాదేవపూర్ పలివెల మండలాల్లో 38 మెడికల్ షాపుల నిర్వహణ.
అద్దె ఫార్మసీ సర్టిఫికెట్, తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫార్మసిస్టులే.
కాసుల మత్తులో డ్రగ్స్ అధికారులు, అక్రమ మెడికల్ నిర్వహణపై నేటికీ చర్యలు లేవు, అధికారులకు అయ్యప్ప గుడి అక్షింతలు.!?.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
మెడికల్ షాప్ నిర్వహణ మందుల విక్రయాలు ఆషామాషీ వ్యవహారం కాదు అద్దె ఫార్మసీ సర్టిఫికెట్ తో నిర్వాహకునికి సంబంధించిన వారందరూ ఫార్మసిస్టులే అనుకుంటూ ప్రజలకు మందులు విక్రయించడం జరుగుతుంది. మెడికల్ షాప్ నిర్వహణకు సంబంధించి కనీస నిబంధనలు కూడా లేకుండా మహదేవ్పూర్ పలివెల ఉమ్మడి మండలంలో మెడికల్ మాఫియా రెచ్చిపోవడం జరుగుతుంది. నేడు ప్రజలు సత్వర ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మందుల దుకాణాలను నమ్ముకుని ఉండడం వాటిని ఆసరాగా చేసుకున్న మెడికల్ మాఫియా నిర్వాహకులు ఫార్మసీ కెమిస్ట్ అండ్ రిజిస్ట్ అనే పదాన్ని అద్దె సర్టిఫికెట్ తో నిర్వాహకుల కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు కూడా ఫార్మసిస్టుగా మారి మందులను విక్రయించడం జరుగుతుంది. ఇలా మందులు విక్రయించడం అమాయక రోగుల ప్రాణాలకు సంబంధించి కేవలం మందులపై ఉన్న ఎంఆర్పి ధర కి ప్రాధాన్యమిస్తూ కంపెనీ బ్రాండెడ్ మందులకు బదులు ఉమ్మడి మండలమంతా జనరిక్ బంధువులను విక్రయిస్తూ పేద రోగుల నుండి కాసులు దండుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి మండలం చరిత్రలోనే జిల్లా డ్రగ్ అధికారి మందుల దుకాణాల తనిఖీలు చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు.
మహా మండలంలో మెడికల్ మాఫియా జోరు.
మెడికల్ షాప్ మందుల దుకాణం నేడు ప్రజాజీవనంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందుల అవసరాలకు వేద ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరూ మెడికల్ షాప్ లో విక్రయించే మందులపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో మందుల విక్రయాలకు సంబంధించి ప్రధాన గ్రామాలు ఒక మెడికల్ మాఫియాగా ఏర్పడి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఫార్మసీ అనుమతులు లేకుండా కేవలం బీఫార్మసీ సర్టిఫికెట్ లను అద్దెకు తీసుకొని నామమాత్ర మెడికల్ పరిజ్ఞానం ఉన్న లేకున్నా సులువుగా డబ్బు సంపాదించాలని ఆశతో ప్రజల ఆరోగ్యాలను కూడా చూడకుండా విచ్చలవిడిగా మెడికల్ షాపులు ఏర్పాటు చేసి మందులను విక్రయిస్తున్నారు. కేవలం ఒకరు ఇద్దరు బీఫార్మసీ అర్హత ఉండి మెడికల్ షాపులు నిర్వహిస్తున్న క్రమంలో ఓకే లైసెన్స్ పై వారు కూడా అనేక మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకుని మందులను విక్రయించడం జరుగుతుంది.
నిబంధనలు అనుమతులకు తోట్లు జనరిక్ మందుల విక్రయాలు.
మెడికల్ షాప్ నిర్వాహణ సాధారణ ఇతర దుకాణాలు ఏర్పాటు చేసినట్లు చేసే పరిస్థితి ఉండదు.డ్రగ్ లైసెన్స్ డిపాజిట్ ఫీజు లేదా చలాన్ ఇన్‌వాయిస్‌లు,ప్రాంగణం కోసం బ్లూప్రింట్ లేదా కీ ప్లాన్.ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకునే ఆధారం.యజమానులు లేదా భాగస్వాముల గుర్తింపు మరియు చిరునామా రుజువు,ప్రాంగణం యొక్క యాజమాన్య రుజువు,నమోదిత మరియు ,పూర్తి సమయం పని చేసే నమోదిత ఫార్మసిస్ట్ లేదా సమర్థ వ్యక్తి యొక్క అఫిడవిట్.డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకార కఠిన నిబంధనలతో మెడికల్ షాప్ నిర్వహణ తోపాటు విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి మండలంలో విచ్చలవిడిగా నిర్వహించబడుతున్న మెడికల్ షాపులకు ఇలాంటి అనుమతులు లేకున్నప్పటికీ సాధారణ గ్రామపంచాయతీ పరువు రిజిస్ట్రేషన్ తో బందుల దుకాణాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక మందుల విక్రయాలకు సంబంధించి కంపెనీ మందులకు హోల్ సేల్ ధర రిటైల్ ధరకు పోలిస్తే కేవలం 10% మార్జిన్ ఉంటుంది గనుక జనరిక్ మెడిసిన్ 60 శాతం మార్జిన్ లాభం రావడంతో మెడికల్ షాపుల్లో అన్ని జనరిక్ మందుల విక్రయాలు మరో విచిత్రం ఏమిటంటే ప్రైవేట్ కంపెనీలు శాంపుల్ అందించినటువంటి రిప్రెజెంట్ న్యూస్ ద్వారా వచ్చిన బంధువులను ఒక ప్రధాన నగరం నుండి నో సెల్ అని ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి మండలంలోని మెడికల్ షాపుల్లో విక్రయాలు జరపడం కొనసాగుతుంది.
ప్రతి ఆర్.ఎం.పి వద్ద మెడికల్ షాపు నిర్వహణ.
ఇక ప్రస్తుతం మహాదేవపూర్ గుమ్మడి మండలంలోని 26 గ్రామాల్లో ఒకవైపు మండల కేంద్రం నుండి మొదలుకొని ఆరు మూల ప్రాంతాల వరకు ప్రాథమిక చికిత్స కేంద్రం పేరుతో ఒక వ్యక్తి కుర్చీ వేసుకుని డాక్టర్ అంటూ తన పక్కకు మరో వ్యక్తి మందుల దుకాణం ఏర్పాటు చేసుకొని డాక్టర్ చిట్టి తీసుకున్న తర్వాత ఆ మెడికల్ షాపులకు వెళ్లి మందులు తీసుకోవడం ఆనవాయి, కానీ ఈ డాక్టర్ రాసింది ఏమిటి మెడికల్ షాప్ వివాహకుడు ఇచ్చిన మందులు తీసుకోవచ్చా అనే విషయానికొస్తే, ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే మందులు తక్కువ డోస్ ఉండడం కూడా ఇటు మెడికల్ నిర్వాహకులకు సంపాదించుకునే దారి అని చెప్పవచ్చు, ఎందుకంటే ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే పారాసెటమాల్ 200 ఎంజిలు ఉంటే అదే డోలో పారాసెటమాల్ 500 ఎంజి మెడికల్ షాపుల్లో ఇవ్వడం జరుగుతుంది, కేవలం 40 నిమిషాల్లోనే వచ్చిన జనాన్ని మాయం చేసే ఘనత మెడికల్ షాపు దక్కించుకుంది. దూల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆ మెడికల్ షాప్ నిర్వాహకులు మీకు తెలుసా దూలపై అతనికి పరిజ్ఞానం ఉందా సాధారణ వ్యక్తి డోలో మెడిసన్ వేసుకోవచ్చా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులపై మెడికల్ నిర్వాహకునికి ఏమైనా తెలుసా అలాంటి ఏమి విషయాలు అవసరం లేదు, ఎందుకంటే దాని పేరు మెడికల్ షాప్ అది ఆ రోగికి రోగాన్ని తక్షణం సాయం చేస్తుంది. ఇలా ఆర్ఎంపీల ముసుగులో వేల రూపాయలు మెడికల్ షాపుల ద్వారా అమాయక పేద రోగులను బురిడీ కొట్టిస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఇలా సులువుగా అమాయకులను పెద్ద పెద్ద రోగాల్లో నెట్టే ప్రయత్నంలో తెలిసి తెలవని బంధువులను వారికి అందిస్తూ వేల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.
అద్దె ఫార్మసీ సర్టిఫికెట్, తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫార్మసిస్టులే.
ఫార్మసిస్ట్ అవసరం లేదు మహదేవ్పూర్ మండలంలో మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకొని జనరిక్ మందులు ప్రజల్లో నాటుకుపోయిన కొన్ని కంపెనీ బంధువులను ఏజెన్సీల ద్వారా రప్పించుకొని మరోవైపు మెడికల్ రిప్రజెంటిటివ్ ల నుండి అందించే షాంపులను కూడా పెట్టుకుని ఫలానా మెడికల్ షాప్ అని ఒక చిన్నది రూమ్ లో నాలుగు మందులు డబ్బాలతో కూర్చుంటే సరిపోతుంది. అదే మెడికల్ షాప్, ఎవరైనా ప్రశ్నిస్తారని ముందే ఊహించిన మెడికల్ మాఫియా నెలకు 1500 రూపాయల చొప్పున అందించి ఒక డీఫార్మసీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీని లామినేషన్ చేసి మందుల డబ్బాలపై అతికిస్తే సరిపోతుంది, ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండదు. ఇంట్లో చిన్న పిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు అందరూ ఫార్మసిస్టులే, ఒక తెల్ల చిట్టి వస్తే సరిపోతుంది వారందరికీ తెలుసు చిట్టి వస్తే దేవుడు కరుణించినట్టే దాని తర్వాత ఒక తెల్ల సంచి అది కూడా ప్లాస్టిక్ రహిత, పేపర్ కవర్ ప్రజల ఆరోగ్యాలకు ప్లాస్టిక్ హానికరం కానీ ఏమీ తెలవని దొంగ ఫార్మసిస్టులు దొంగ మెడికల్ షాపులు మాత్రం సేఫ్ ఈ విధంగా ఆ తెల్ల కవర్ నిండిపోయి సుమారు 600 నుండి 800 వరకు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా వైద్య విద్య ఫార్మసీ డ్రగ్ పై ఎలాంటి అవగాహన కనీస పరిజ్ఞానం లేకుండా ఒక లక్ష రెండు లక్షల రూపాయల పెట్టుబడి తో ఉమ్మడి మండలమంతా కిరాణం కొట్టులకు మించిపోయి మెడికల్ షాపులు ఏర్పాటుచేసి మందులు విక్రయించడం జరుగుతుంది.
కాసుల మత్తులో డ్రగ్స్ అధికారులు, అక్రమ మెడికల్ నిర్వహణపై నేటికీ చర్యలు లేవు, అధికారులకు అయ్యప్ప గుడి అక్షింతలు.!?.
ఇక మహాదేవపూర్ మండలంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా కనీస ఫార్మసీ చట్టాలకు దోచుకోకుండా ఒకవైపు షాంపూల్ మెడిసిన్ మరోవైపు కంపెనీల పేరుతో జనరిక్ మందుల విక్రయాలు మెడికల్ అంటే ఏమిటో తెలవని వారు కూడా ఫార్మసిస్టులుగా మారిపోయి విచ్చలవిడిగా మందుల విక్రయాలు చేస్తుంటే జిల్లా డ్రెస్ అధికారులు మాత్రం న్నెత్తి చూడడం లేదు. డ్రగ్స్ అధికారులు మెడికల్ షాపులపై దాడులు చేయడం జరిగిందని మెడికల్ షాపుల్లో నిర్వహణ అనర్హులుగా ఉండి మందుల దుకాణం నిర్వహిస్తున్నారని మెడికల్ షాపులో అమ్మే మందులు నిషేధిత మందులను విక్రయిస్తున్నారని ఇలాంటి సందర్భాలు మహాదేవపూర్ ఉమ్మడి మండలం అలాగే మహదేవ్పూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో జిల్లా డ్రగ్ అండ్ ఫార్మసీ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, కేవలం ఒక యూనియన్ అధికారులకు మహదేవ్పూర్ మండల కేంద్రానికి ముందు ఒక అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అయ్యప్ప దేవుడి సాక్షిగా ఆ అధికారి ఆలయం వరకి పరిమితమై స్వామివారిని దర్శించుకుని అక్షింతలు తీసుకొని వెళ్లిపోవడం జరుగుతుందని విశ్వనీయ సమాచారం, అయ్యప్ప స్వామి అక్షింతలు తీసుకున్న ఆ అధికారులు ఉమ్మడి మండలంలో మెడికల్ షాపుల నిర్వహణపై ఇలా చర్యలు తీసుకుంటారు స్వామివారికి కోపం వస్తుందని అక్షింతలతో సంతోషంగా వెళ్లిపోవడం జరుగుతుందని తెలుస్తుంది.
ఉన్నత వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడి సమయపాలన కరువు.
నర్సంపేట,నేటి ధాత్రి :
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తూ పల్లె దవాఖానలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.కానీ ఆ ఆసుపత్రులలో వైద్యుల సమయపాలన లేక మెరుగైన వైద్యం లోపిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అత్యవసర పరిస్థితుల్లో వెళ్లిన రోగులకు ఆసుపత్రిలో స్టాఫ్ నర్ లే దిక్కవుతున్నారు.ఇదే పరిస్థితి దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలో బుదవారం మధ్యాహ్నం జరిగింది.దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన కక్కెర్ల రమేష్ తెలుకాటుకు గురయ్యాడు.వెంటనే చికిత్సా నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లగా స్థానిక వైద్యాధికారి అందుబాటులో లేరు.వెంటనే స్పందించిన స్టాఫ్ నర్స్ సబిత తాత్కాలిక ట్రీట్ మెంట్ చేశారు.సమాచారం మేరకు నేటిధాత్రి ప్రతినిధి ఆసుపత్రికి వెళ్లగా వైద్యాధికారి అందుబాటులో లేరు.వెంటనే ఫోన్ ద్వారా వివరణ కోరగా మందపల్లి పల్లె దవాఖానకు విజిటింగ్ కోసం వెళ్లానని తెలిపారు.మందపల్లి పల్లె దవాఖానకు వెళ్లగా మధ్యాహ్నం 2.30 గంటలకే ఆ పల్లె దవాఖానకు తాళంవేసి వెళ్ళిపోయారు.కాగా 3-40 గంటలకు హడావుడిగా చేరుకున్న వైద్యాధికారి రోగిని పరిశీలించి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ తెలుపుతూ 10 నిమిషాల వ్యవధిలోనే నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు రెఫర్ చేశారు.ఈ సందర్భంగా బాధితుడు రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రికి వెళ్ళగానే డాక్టర్ అడుబాటులో లేదు అక్కడి స్టాఫ్ నర్సులు వైద్యం అందించారు.చాలా సమయం తర్వాత వచ్చిన డాక్టర్ నన్ను పరిశీలించి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుపుతూ 10 నిమిషాల వ్యవధిలోనే నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళాలని రెఫర్ చేశారని ,ఉన్నత వైద్యాధికారి అయి ఉంది కనీసం అబ్జర్వేషన్ లో ఉంచుకోకుండా నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళాలని రెఫర్ చేయడం బాడకలిగిందని తెలిపారు.పల్లె దవాఖానలలో,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు విజిటింగ్స్,మీటింగ్స్ పేరుతో డ్యూటీలను మధ్యలోనే డుమ్మా వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు,రోగులు ఆరోపిస్తున్నారు.పిహెచ్ సి లకు,పల్లె దవాఖానలకు వైద్యాధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని తరిస్థితి నెలకొంటున్నదని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా ,డివిజన్ స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు,ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సమయపాలన పాటించని వైద్యాధికారులు,సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
17 వ తేదీన హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీరించిన పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వేలాది మంది బి.ఆర్.యస్.పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తరలి రావాలని,ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బి.ఆర్.యస్.పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.
మీడియాతో మంత్రి హరీశ్ రావు..
రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము.
*బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ఏర్పాటు.
*అధ్యక్షురాలుగా భూతం సుశీల
మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం రాజుపేట గ్రామంలో స్వచ్ఛందంగా బడే నాగజ్యోతిని గెలిపించడానికి, బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ని భూతం సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగిందనీ. ఈ సందర్బంగా భూతం సుశీల మాట్లాడుతూ,మహిళలమైన మేము ముందు అడుగు వేసి, మా మహిళ శక్తిని చాటి చేప్పుతామని , బడే నాగజ్యోతక్క గెలుపులో మా పాత్ర కీలకం గా ఉండబోతుందని తెలియజేశారు. బడే నాగ జ్యోతక్క ను గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము అని అన్నారు .పేదల బాధలు తెలిసిన నాయకురాలు, ప్రజాభివృద్ధి తన జీవిత ధ్యేయంగా ఆచరిస్తున్న ఆత్మీయురాలు, ఈ సమాజమే తమ కుటుంబం అని సమాజక్షేమం కోసం ప్రతిక్షణం ఆలోచించి శ్రమించే తత్వం ఉన్న బడే నాగ జ్యోతక్క అధికారంలోకి వస్తేనే మా జీవితాల్లో అభివృద్ధి వస్తుందని, అన్నారు. ఈ కార్యక్రమంలో బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం స్వచ్ఛంద సమితి సభ్యులు భూతం సుశీల, గూడపు పద్మ, మైపా రమణ, కర్రీ. కుమారి, మైప నాగమణి, కర్రీ. సరస్వతి, దార్ల రామక్క, కర్రి ముత్తమ్మ, రాణి, గంపల జయ, తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మధ్య మాఫియాను అరికట్టడంలో ఎక్సేంజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామాలలో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ విమర్శించారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం మండల నాయకులు సోమసత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ వివిధ గ్రామాలలో వైన్ షాపు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బెల్టు షాపు వాళ్లు అధిక ధరలకు మధ్యాన్ని అమ్ముతూ మద్యం ప్రియుల జేబులు గుల్లా చేస్తూనే మరోవైపు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే వైన్ షాపు యజమానులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపుల దందాను నడిపిస్తుంటే సంబంధిత ఎక్సేంజ్ అధికారులు పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు వాపోతున్నారు. బెల్టు షాపుల వల్ల గ్రామాలలో ఉదయం నుండి మొదలుకొని రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుడంతో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పాడుతుందని ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో బెల్ట్ షాపులు వందల సంఖ్యలో వెలుస్తున్నాయని అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే గ్రామాలలో బెల్ట్ షాపులను నియంత్రించాలని ఇంత జరుగుతున్న ఎక్సేంజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు కానీ షాపు యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాలలో పేదలు, కూలీలు, యువకులు లిక్కర్కు అలవాటు పడుతూ మద్యానికి బానిసై పనులకు సైతం వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులోనే వారి జీవితం తెల్లారిపోతుందని, మద్యం మత్తులో కుటుంబ కలహాలు ఎక్కువై సంసారాలు బజార్న పడుతున్నాయని బెల్ట్ షాపుల వల్ల మహిళలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడి పోతున్నారని ఇప్పటికైనా ఎక్స్చేంజ్ అధికారులు నిద్రమత్తు విడిచి బెల్ట్ షాపులను నియంత్రించాలని అధిక ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపుల యజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, నాయకులు ముసుకు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి పట్టణంలోని మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని, విద్యార్థులు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎన్జిఓ భువనేశ్వరి మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ, విద్యాబుద్ధులతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రార్థిస్తూ, బతుకమ్మ సంబరాలు ఆనంద ఉత్సాహాలతో పాఠశాల ఆవరణలో జరుపుకోవడం జరిగిందని అన్నారు. మన పూర్విక సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.