
పి.వై.ఎల్ .రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా గుమ్మడి నర్సయ్య ఎన్నిక
మహబూబాబాద్,నేటిధాత్రి: దేశంలో ప్రజాస్వామిక హక్కులకు,ప్రజల ఐక్యతకు,దేశ లౌకిక వ్యవస్థకు,పెను ప్రమాదకరంగా మారుతున్న కుల,మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటిస్తూ కొనసాగుతున్న ప్రగతిశీల ఉద్యమాల్లో యువత క్రియాశీలక భాగస్వాములు కావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు.శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభల నిర్వహణకై ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం పి.వై.ఎల్.రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకు డోతు అజయ్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య…