
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో పెద్ద పల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు,పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎండపెల్లి మండలం పడకల్ గ్రామంలో ఐకేపీ రైతులు హమాలీల తో మరియు ఉపాధి హామీ కూలీలతో కారు గుర్తు కు ఓటువేసి ఈశ్వర్ ను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ కంది లావణ్య గ్రామశాఖ అధ్యక్షులు మేకల అంజి గాధం భాస్కర్ తెలంగాణ ఉద్యమ కారుడు పడిదం వెంకటేష్ బీసీ సెల్ మండల అధ్యక్షులు చింతల తిరుపతి ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షులు గౌరి చిరంజీవి పాల్గొన్నారు*