వడ్డెర ఓబన్న 207వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిఆర్ఎస్ నేత రావులపల్లి రాంప్రసాద్

భద్రాచలం నేటి ధాత్రి

*భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏ రోడ్ లో భద్రాచలం వడ్డెర కార్మిక సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న 207 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ పూలు చల్లి నివాళులర్పించారు…*

అనంతరం వడ్డెర కార్మిక సోదరులకు వడ్డెర ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలు పొందాలని. హక్కులు సాధించాలని అన్నారు..

దేశ స్వతంత్ర పోరాటంలో వడ్డెర ఓబన్న పాత్ర చాలా గణనీయమైందని అన్నారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, మండల నాయకులు అయినాల రామకృష్ణ,బద్ది బాబి, వడ్డెర కార్మిక సంఘం నాయకులు గుంజా చెన్నకేశవ, గుంజ లక్ష్మణ్ బాబు,సాయి, రామకృష్ణ, మల్లయ్య తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!