నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని
11 వ వార్డులో గల కూరగాయల మార్కెట్ పెద్ద కాలువ నుండి సంజీవిని ఆశ్రమం వరకు సిసి రోడ్ నిర్మాణ పనులును సంజీవిని ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్ మోహన్ రావు స్థానిక కౌన్సిలర్ గంప సునీత రఘునాథ్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా
డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళా నేడు నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ ఏఈ ,జిల్లా గ్రంధాలయ శాఖ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్ , వేల్పుల కన్నయ్య, సంగేపు శ్రీధర్ ,యాదగిరి,గిరి గారు గంప రామకృష్ణ గౌడ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.