చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి . గండ్ర వెంకట రమణా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని చింతకుంట రామయ్య పల్లె గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రజలను కోరి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు సమేతనే ఉండే(నమ్మి నాన పోస్తే నాట పుచ్చి బుర్రలు ఐనాయట) కావున ప్రజలు అభివృద్ధి ప్రదాత ను ఆదరించాలి అని జెడ్పీటీసీ గొర్రె సాగర్ ఇంటింటికీ తిరిగి ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ మ్యానిఫెస్టోను అందరికీ వివరించారు,బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే.400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతుంది.ఆసరా పింఛన్ 5000 కు పెరుగుతుంది.వికలాంగుల పింఛన్ 6 వేలకు పెరుగుతుంది.ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెరుగుతుంది.తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేయడం జరుగుతుంది5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తుంది.సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 రూపాయలు అందజేయడం జరుగుతుంది.నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోకారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకట రమణా రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జెడ్పీటీసీ గొర్రె సాగర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై కెసిఆర్ గారి మానిఫెస్టోను ప్రజలకు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు