టిడిపి కమిట్మెంట్‌ బిఆర్‌ఎస్‌లో లేదు!

https://epaper.netidhatri.com/view/286/netidhathri-e-paper-6th-june-2024%09/2

చంద్రబాబు నాయకుడు కేసీఆర్ ఉద్యమకారుడు

`చంద్రబాబు వ్యాపారాలు చేసి సంపాదించాడు.

`కేసిఆర్‌ కమీషన్లతో ఆస్తులు కూడబెట్టుకున్నాడు.

`తెలంగాణ సొమ్ము దిగమింగాడు.

`తెలంగాణ ప్రజలను మోసం చేశాడు.

`కరంటు ఇచ్చినా అని కాకమ్మ కథలు చెప్పాడు.

`నీళ్లిచ్చినా అని చెప్పి నిలువునా దోచుకున్నాడు.

`చంద్రబాబు మీద అలాంటి ఆరోపణలు లేవు.

`2019లో 23 సీట్లొచ్చినా ఎవరూ జారిపోలేదు.

`ఎన్ని ఇబ్బందులైనా ఆ పార్టీ నాయకులు పారిపోలేదు.

`కడదాక టిడిపి ఎదిరించి నిలిచింది.

`చెక్కు చెదరని యంత్రాంగం టిడిపిది.

`తెలంగాణలోనూ ఇప్పటికీ దాని ఆనవాలు వుంది.

`బిఆర్‌ఎస్‌లో ఎంత మందికి ఆ కమిట్మెంటు వుంది.

`పార్టీ కోసం పని చేసిన వాళ్లను కేసిఆర్‌ నిర్లక్ష్యం చేశాడు.

`అవకాశవాదులను చేరదీశాడు.

`అవసరం తీరగానే వాళ్లు వెళ్లిపోయారు.

`కేసిఆర్‌కు గుణపాఠం నేర్పారు.

`నాయకులనే కలవలేని కేసిఆర్‌.

`కార్యకర్తల ముఖం చూడని కేసిఆర్‌.

`రెండు సార్లు గెలిచే ఎగిరెగిరి పడ్డాడు.

`చంద్రబాబు నాలుగు సార్లు సిఎం అయ్యాడు.

`ప్రతి పక్ష నాయకుడు పాత్ర మూడు సార్లు పోషించాడు.

`ఇప్పటికీ జనం ఆయననే కోరుకున్నారు.

`అదీ జననేత అంటే…అదీ ప్రజాసేవ అంటే!

`జాతీయ రాజకీయాలలో అవకాశం వచ్చినా చంద్రబాబు నా తెలుగు ప్రజలు అన్నాడు.

`కేసిఆర్‌ తెలంగాణను గాలికొదిలేసి దేశ్‌కి నేత కావాలనుకున్నాడు.

`రెండు ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చంద్రబాబు నాయుడు ఒక విజన్‌ లీడర్‌. విస్‌డమ్‌ లీడర్‌. విన్నింగ్‌ లీడర్‌. పీపుల్స్‌ లీడర్‌. క్యాడర్‌ లీడర్‌. అవును ఇన్ని రకాల డైమెన్షన్లు వుండడం వల్లనే ఆయన ఇంకా రాజకీయాల్లో వుండగలుతున్నారు. రాజకీయాలను ఏలగలుగుతున్నారు. ఎన్ని సార్లు గెలిచినా పొంగిలేదు. ఎన్ని సార్లు ఓడిపోయినా కుంగిపోలేదు. క్యాడర్‌ను కుంగనివ్వలేదు. ఆత్మవిశ్వాసం సడలనివ్వలేదు. ఆఖరుకు ఈ వయసులో కూడా జైలుకెళ్లినా ఎక్కడా ధైర్యం చెడలేదు. ఈ రాజకీయాలెందుకు అని పారిపోలేదు. ఎదిరించి నిలబడడమే ఆయనకు తెలుసు. ఎదుర్కొని సాదించడమే ఆయనకు తెలుసు. అందుకే దేశ రాజకీయాల్లో నాయకులు ఎంతో మంది తెరమరుగౌతున్నా, ఆయన నిలబడ్డాడు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ వున్నారు. విజయాలను దాసోహం చేసుకుంటూ వస్తున్నారు. వరసుగా రెండుసార్లు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. విజన్‌ 2020తో అద్భుతమైన పాలనచేశారు. ఆయన పాలకుడిగా కన్నా, సిఈవోగా ఇతర పార్టీలు వర్ణించినా ఆయన లెక్క చేయలేదు. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు మేనేజ్‌ మెంటును అనుసరించారు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు హైదరాబాద్‌ పెరిగింది. హైదరాబాద్‌కు ఒక గుర్తింపు వచ్చింది. అంతకు ముందుకు వున్న గుర్తింపు వేరు. అది చారిత్రక నేపధ్యం. చంద్రబాబు మూలంగా అభివృ ద్ది నేపథ్యాన్ని అందుకున్నది. హైదరాబాద్‌ నలు మూలలా పెరిగింది. సైబర్‌ సిటీగా వెలుగొందుతోంది. ఐటి పరిశ్రమకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అందుకు చంద్రబాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు. అయితే అదే దశలో ఆయన ఓసారి నోరు జారి, నాటి యువతను విద్యా రంగం వైపు దృష్టి మళ్లించేందుకు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రత్యర్ధులకు ఉపయోగపడ్డాయి. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు మారేందుకు దోహదపడ్డాయి. అయినా ఆయన వెనుకంజ వేయలేదు. యువత భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించారు. అందుకే ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగువారు వుండడానికి, ఐటి రంగాన్ని ఏలడానికి కారణం చంద్రబాబు అని గొప్పగా చెబుతారు. గర్వంగా చంద్రబాబును పొగుడుతుంటారు. ఆ తర్వాత వైఎస్‌ వచ్చినా, తెలంగాణ విడిపోయినా ఐటి రంగాన్ని కొనసాగింపులో దూకుడు కనిపించలేదు. చంద్రబాబు కాలంలోనే ఐటి గొప్పగా విలసిల్లింది. ఐటికి పునాదులు పడిరది. అమెరికా అధ్యక్షులు కూడా రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా ఆయన అటు రాజకీయాన్ని ఇటు పాలనలో సంస్కరణలు ఏక కాలంలో తెచ్చి ఎంత మంది యువత భవిష్యత్తుకు మార్గాలువేశారు. ఐటి నిపుణులంతా నిరంతరం చంద్రబాబును కొనియాడుతుంటారు.

చంద్రబాబు అంటే ఒక కమిట్‌ మెంటు. నిత్యం ప్రజలతో వుంటారు. ప్రజల్లో వుంటారు. ప్రజల కోణంలో ఆలోచిస్తారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటుంటారు. నేరుగా వారితో ఇంటరాక్ట్‌ అవుతుంటారు. ముఖ్యంగా యువత ఆలోచనలు ఎప్పటికిప్పుడు తెలుసుకుంటుంటారు. వారి ఆలోచనతకు అనుగుణంగా తన కార్యాచరణ చేపడుతుంటారు. ఇదీ ఒక విజన్‌ వున్న నాయకుడు లక్షణం. ఇది సరిగ్గా కేసిఆర్‌కు ఆపాదిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా సరిపోదు. తెలంగాణ ఉద్యమం…తప్ప చెప్పుకోవడానికి మరేమీ లేదు. నీళ్లు, నిధులు, నియమకాలు అనే ట్యాగ్‌ లైన్‌తో పోరాటం చేసినా, పదేళ్ల కాలం నీళ్ల గురించే తప్ప, నియామకాల గురించి ఆలోచించలేదు. యువత గురించి అసలే పట్టించుకోలేదు. ప్రజల్లోకి రాలేదు. ప్రజలతో ఆలోచనలు పంచుకోలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేదు. ఆఖరుకు నాయకులకే అప్పాయింటు మెంట్లు ఇవ్వలేదు. ఇన్వెస్టర్లను కలవలేదు. వారితో మాట్లాడిన సందర్బాలు లేవు. కాని ఆరు నెలలకోసారి వచ్చి కోతలు కోయడం మాత్రం తెలుసు. అసలు యువత భవిష్యత్తేమిటి? ఈ తరం ఆశయాలేమిటి? అన్నదానిపై పదేళ్ల కాలంలో ఆయన చేసింది లేదు. చెప్పింది లేదు. పిట్ట కధలు, కట్టు కథలు, పద్యాలు..పాటలు తప్ప ఆయన చెప్పగలిందేమీ లేదు. కాని చంద్రబాబు వేరు. నిజంగా దేశ రాజకీయాల్లో ఇతర నాయకులకు, చంద్రబాబుకు వున్న ప్రత్యేకత మరెవ్వరికీ లేదు. అందుకే ఆయన విజన్‌ చంద్రబాబు అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు హైదరాబాద్‌ ను గొప్పగా తీర్చిదిద్దాడు. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సొగసులు అద్దే ప్రయత్నం గొప్పగా చేశాడు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అనేక అవస్ధలు పడ్డాడు. రాజధాని తీర్దిదిద్దడం కోసం అహర్నిషలు కృషి చేశాడు. ఏపికి పెట్టుబడుల కోసం దేశ దేశాలు తిరిగాడు. అమరావతిని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కాని తర్వాత వచ్చిన జగన్‌ దాన్ని నిర్వీర్యం చేశాడు. కాని ఇప్పుడు చంద్రబాబు ఈ అవకాశాన్ని వదులుకోరు. అమరాతిని సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు గొప్పగా చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాదు ఆయన ఇప్పుడు కేంద్రంలో కీలకపాత్ర పోషించే అ వకాశం కూడా వుంది. గతంలో ఎన్డీయేలో కీలకభూమిక పోసించి హైదరాబాద్‌ కోసం విపరీతంగా కృషి చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎంతో చేసేందుకు సిద్దమౌతున్నారు. ఆయనకు తెలుగు నేల అంటే ఇష్టం. తెలుగునేల అభివృ ద్ది ఇష్టం. 1998 తర్వాత ఆయనకు దేశ రాజకీయాలను ఏలే అవకాశం వచ్చింది. ప్రధాని అయ్యే అవకాశం కూడా వచ్చింది. కాని ఆయన ఒకటే చెప్పారు. నా తెలుగు నేల అభివృద్దే నాకు ముఖ్యమన్నారు. తెలుగు ప్రజల శ్రేయస్తే ప్రధమ కర్తవ్యమన్నారు. అలా ఆయన తెలుగు ప్రజల కోసం ప్రదాని అవకాశం వచ్చినా వద్దనుకున్నారు. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది.. దానిని ఆయన జారవిడుకోరు. పరిస్ధితులను బట్టి ఏపికి ప్రత్యేక హోదా సాధించే అవకాశం వదలుకోరు. వెనుకబడిన జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కోరుతారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటారు. పోలవరం పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తారు. ఇలా అనేక సవాళ్లు ఆయన ముందు పెట్టుకున్నారు.

పార్టీని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాడు. పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు అదికారం లేకపోయినా పార్టీని కాపాడుకున్నగొప్ప నాయకుడు చంద్రబాబు. ఆ వయసులో కూడా పార్టీ కోసం పాదయాత్ర చేశారు. బస్సు యాత్ర చేశారు. ఇలా ఎప్పుడూ ప్రజల్లో వుంటారు. గత 2019 ఎన్నికల్లో ఏపిలో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా ఆయన రాజకీయాలకు దూరం కాలేదు. క్యాడర్‌ చెల్లాచెదురౌతుందని అందరూ అనుకున్నారు. కాని తెలుగుదేశం శ్రేణులు అంటే వారికి వుండే అంకితభావం మరేపార్టీకి లేదనే చెప్పాలి. నాయకుడి అండ వుంటే ఏ పార్టీ అయినా ఎంత కాలమైనా మనుగడలో వుంటుంది. 2019 ఫలితాల తర్వాత అందరూ చంద్రబాబు పని అయిపోయిందనే అన్నారు. కాని పడిలేచిన కెరటంలా ఆయన పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. అటు లోకేష్‌తో పాదయాత్ర చేయించారు. ఆయన జిల్లాలన్నీ తిరిగారు. ప్రజలను చైతన్యం చేశారు. రాజధాని లేని రాష్ట్రం వల్ల ఎంతో నష్టం జరగుతుందని ప్రజలను తట్టిలేపారు. తన రాజకీయమే కాదు, ఏపి భవిష్యత్తును ప్రజల ముందు వుంచారు. దాంతో ప్రజలు కూడా బాగా ఆలోచించారు. పైగా చంద్రబాబుపై గత ప్రభుత్వం సాగించిన కక్ష్య సాదింపు చర్యలతో పార్టీ కకావికలమౌతుందని అందరూ అనుకున్నారు. పార్టీ నాయకులంతా వైసిపికి క్యూ కడతారనుకున్నారు. ఎవరూ జగన్‌ వైపు వెళ్లలేదు. తెలుగుదేశం జెండా విడిచిపెట్టలేదు. అమెరికా నుంచి వచ్చి మరీ తెలుగుదేశం అభిమానులు ఏడాది కాలం పాటు అమరావతి ఉద్యమం చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు, అభిమానులకు వున్న నమ్మకం అంత గొప్పది. కాని బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణలో ఎంత మంది కార్యకర్తలకు అలాంటి విశ్వాసం వుంది? ముందుగా నాయకుడికే కార్యకర్తలను కలిసే తీరిక లేదు. నాయకులతో చర్చించే ఓపిక లేదు. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం ఆనవాళ్లు ఎందుకున్నాయో కూడా కేసిఆర్‌ తెలుసుకోలేరు. తెలిసినా తన రాజకీయం తప్ప, నాయకుల కోసం ఏనాడు ఆలోచించడు. ఆయన కోసం పనిచేసిన నాయకులను ఏనాడు అందలమెక్కించలేదు. చంద్రబాబు వెంట ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ బంధుగణం లేదు. కాని కేసిఆర్‌ కోటరే బంధువులు…ఇంతకన్నా దౌర్బాగ్యం ఏమీ వుండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *