BJP Foundation Day in Bhupalpally
ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ…
1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, ఈ 47 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ, త్యాగాలు, పోరాటాల ఫలితంగా బీజేపీ ఈ స్థాయికి ఎదిగి, కేంద్రంలో అలాగే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తో రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ లు జన్నే మొగిలి పార్లమెంట్ కొ కన్వీనర్ లింగంపల్లిప్రసాద్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి కార్యాలయం కార్యదర్శి వట్టం తిరుపతి మీడియా ఇంచార్జ్ మునెందర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలీఫ్, జిల్లా నాయకులు పొన్నాల కొమురన్న,తుమ్మటి రాంరెడ్డి,తాటికంటి రవి కుమార్ తాటికంటి రవికుమార్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
