Suravaram Pratap Reddy Jayanti on 28th
28 న వనపర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి జియంతి వేడుకలు
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అధ్యరములో
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి మొదటి ఎమ్మెల్యే దివంగత
సురవరం.ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జీ నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు మొట్టమొదటి వనపర్తి శాసనసభ్యులు సురవరం.ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా, నిర్వహించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించామని నందిమల్ల అశోక్ తెలిపారు సురవరం.ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథి దులుగా కవులు సాహితీవేత్తలు సాగునీటిరంగ నిపుణులు వి.ప్రకాష్ శ్రీధర్ రావు దేశ్ పాండే ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు.గిరిజా మనోహర్ బాబు పాల్గొంటారని ఆయన తెలిపారుఈ సమావేశములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు రిటైర్డు ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ సాహితీవేత్తలు వీరయ్య బలరామ్,నారాయణ రెడ్డి ,బైరోజు చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు మల్యాల బాలస్వామి సత్తార్ చంద్రశేఖర్,కిరణ్ జోహెబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారని అశోక్ తెలిపారు
