Bike Thieves Arrested in Narsampet
బైక్ దొంగల అరెస్ట్ – రెండు వాహనాలు స్వాధీనం
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో ఇటీవల జరిగిన బైక్ దొంగతన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో పొన్నాల శివశంకర్ (పాల్వంచ), అతని భార్య పొన్నాల రేణుక, పర్ని అశోక్ ఉన్నారు.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల విలువ గల రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.

అనంతరం ముగ్గురిని రిమాండ్కు తరలించామన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన నిందితుడు శివశంకర్పై హైదరాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో పలు కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు.దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన నర్సంపేట పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు రవికుమార్, అరుణ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
