భూపాలపల్లి బాద్‌ షా గండ్ర

`బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రకే…

`వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రదే…

`గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

`నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం.

`రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…

`రెండు సార్లు ఎమ్మెల్యే…

`ఒకసారి ఎమ్మెల్సీ..

`ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్‌ విప్‌…

`ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…

`ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…

`సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం.

`అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం.

`నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం.

`పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి.

`పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు.

` నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

`ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాలం కలిసొస్తుంది…ధర్మం, న్యాయం మనవైపు వుంది. తెలంగాణ వచ్చి తీరుతుంది… ఇది ఎవరో అన్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 2009లో అన్న మాటలు. మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో అప్పట్లో చెప్పిన మాట…ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే 2009 ఎన్నికలలో గండ్ర వెంకట రమణారెడ్డి తొలి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే ఆయన ఎమ్మెల్సీ కూడా… అయితే ఆ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కేవలం పది సీట్లు సాధించింది. ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కేటిఆర్‌ అసెంబ్లీ లాబీలో ఎదురైన గండ్ర వెంకట రమణారెడ్డితో కాసేపు తెలంగాణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేటిఆర్‌ చెప్పిన విషయాలను సావధానంగా విన్న రమణారెడ్డి తెలంగాణ రావడం ఖాయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణపై రమణారెడ్డికి వున్న చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేశారు. తన నియోజకవర్గం మీద రమణారెడ్డికి ఎంత ప్రేమ వుందో వివరించే ప్రయత్నం చేశారు. తనకు అత్యంత అప్పుడు రమణారెడ్డి అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఉటంకించారు. రమణారెడ్డి మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. అలాంటి రమణారెడ్డి బిఆర్‌ఎస్‌ లో చేరి భూపాలపల్లికి చేసిన సేవను, అభివృద్ధి కార్యక్రమాలను కీర్తించారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు సభపై కేటిఆర్‌ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి నాయకత్వ పటిమను కొనియాడారు. భూపాలపల్లిలో చరిత్ర తిరగరాసేంత గొప్పగా సభను ఏర్పాటు చేసిన గండ్ర జ్యోతికి ప్రత్యేకంగా కేటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రదే…

భూపాలపల్లిలో జరిగిన బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంత జిల్లా కేంద్రంలో సభైనా అది నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలకున్న నమ్మకం మీద జరిగిన సభ. ఒక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగిన తర్వాత, అక్కడే జరిగిన సభ. సహజంగా ఎన్నికల సభలకు ప్రజలు విశేషంగా హజరుకావడం చూస్తుంటాం. కానీ ఇలాంటి సభలు బహు అరుదు. అవి ఆది నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకే, ఆ పార్టీ నాయకులకే సాధ్యమౌతుంది. ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్‌ పార్టీ సభలకు ప్రజలు గతం కన్నా ఎక్కువగానే వస్తున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జిల్లాలలో సమీకృత కలెక్టర్‌ కార్యాలయం సముదాయాల ప్రారంభోత్సవాలు, మెడికల్‌ కాలేజీల శంకుస్థాపనలకు జరుగుతున్న సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతమౌతున్నాయి. అయితే భూపాలపల్లిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనల తర్వాత జరిగిన బిఆర్‌ఎస్‌ సభ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్‌ అవుతుందని చాలా మంది ఊహించలేదు. కానీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్తశుద్ధి, చొరవ, పార్టీ మీద ఆయనకున్న పట్టు, నాయకులలో ఎమ్మెల్యే మీద వున్న విశ్వాసం ఇవన్నీ సభ ఏర్పాటులో కనిపించాయి. అటు వేధిక, ఇటు ప్రజా సముదాయం ఎమ్మెల్యే మీద మరింత నమ్మకాన్ని పెంచిందనే చెప్పాలి. ఇలాంటి సభల సక్సెస్‌ అన్నది నాయకుల మీద మరింత బాధ్యత పెంచుతుంది. ప్రజల్లో నాయకుడిపై నమ్మకం రెట్టింపు అవుతుంది. ప్రజల ఆకాంక్షలు పెరుగుతాయి. మా సమస్యలు తీరుతాయన్న విశ్వాసం పెరుగుతుంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న గండ్ర వెంకట రమణారెడ్డి మీద రోజు రోజుకూ ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గలేదు. అందుకు భూపాలపల్లి సభ విజయవంతం కావడమే నిదర్శనం. బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ తో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త రెట్టించిన ఉత్సాహం కనిపించింది. పార్టీ మీద కూడా ప్రజలకు మరింత అచంచల విశ్వాసం పెరిగిందనడానికి నిదర్శనం. 

వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రకే… 

భూపాలపల్లిలో జరిగిన సభతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. అడుగడుగునా మంత్రి కేటిఆర్‌ ఎమ్మెల్యేకు ఇచ్చిన ప్రాధాన్యతలోనే రమణారెడ్డికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థమైంది. ప్రతి సందర్భంలోనూ మంత్రి కేటిఆర్‌ ప్రజలకు రమణారెడ్డి నాయకత్వ గొప్ప తనం గురించి వివరించే ప్రయత్నం చేశారు. రమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత శ్రమిస్తారనేది కూడా ప్రజలకు మరింత తెలిసేలా చేశారు. ఇంతటి ప్రాధాన్యమనేది అందరికీ దక్కేది కాదు. ఇలాంటి సభలు తెలంగాణలో పెద్దగా ఏర్పాటు చేసినవి కావు. కానీ ప్రత్యేకంగా రమణారెడ్డి మీద వున్న నమ్మకం, ఆయన నాయకత్వంలో అటు పార్టీకి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కేటిఆర్‌ కు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఒకనాడు ఆయన మనసులోని ఆలోచన తెలుసుకున్న కేటిఆర్‌, ఇప్పుడు రమణారెడ్డి లోని నాయకత్వ దృక్పథం ఎంత విలువైందో తెలిసింది. అందుకే కేటిఆర్‌ ఇంత ప్రాధాన్యత కల్పించారనేది స్పష్టమైంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ కూడా రమణారెడ్డి కే అన్న పరోక్ష సంకేతాలు కూడా పంపినట్లైంది

గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

తెలంగాణలో భూపాలపల్లి అనేది మారుమూల ప్రాంతం. అందులోనూ కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రం. ఆ జిల్లాలో ఒక బ్రహ్మాండమైన సభ జరపడం అన్నది ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఏ మాత్రం తేడావచ్చినా నాయకత్వం మీద వున్న నమ్మకం తలకిందులౌతుంది. రమణారెడ్డికి ప్రజల మీద వున్న విశ్వాసం… ప్రజలకు రమణారెడ్డి అంటే వున్న నమ్మకం మీదనే సభ జరిగింది. సక్సెస్‌ అయ్యింది. పార్టికి మరింత జోష్‌ వచ్చింది. బిఆర్‌ఎస్‌ కు తిగులేదని మరోసారి తరలిపోయింది. 

నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం. 

ఈ విషయం నేటిధాత్రి ఎప్పటి నుంచో చెబుతోంది. తెలంగాణలో గెలిచే నియోజకవర్గాలు ఏవో, నాయకత్వాలు బలంగా ఎక్కడ వున్నాయో, తిరుగులేని నాయకులు ఎవరో ఇప్పటికే అనేక సర్వేలు నిర్విస్తూ వస్తోంది. భూపాలపల్లి విషయంలో కూడా బిఆర్‌ఎస్‌ ఎంత బలంగా వుందో కూడా చెబుతూనే వస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ముందు నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. మునుగోడు అభ్యర్థి విషయంలో నేటిధాత్రి చెప్పిందే ఫైనల్‌ అయ్యింది. తెలంగాణలో నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్‌ బలబలాలపై కూడా ఇప్పటికే పలు మార్లు రిపోర్ట్‌ కూడా ప్రచురించడం జరిగింది. అందులో భూపాలపల్లిలో రాజకీయం ఏం నడుస్తుందో కూడా నేటిధాత్రి చెప్పింది. గండ్ర వెంకట రమణారెడ్డి కే పెద్ద పీఠ అన్నది ఎప్పటి నుంచో నేటిధాత్రి చెబుతూనే వస్తోంది. అదే ఇప్పుడు నిజమైంది. కేటిఆర్‌ కూడా సభలో ఇదే విషయాన్ని కొంత బహిరంగంగా, మరి కొంత నర్మగర్భంగా చెప్పాల్సిన విషయమైతే చెప్పాడు. అర్థమైన వాళ్లు అర్థమైనంతగా వివరంగానే తన అభిప్రాయం వెల్లడిరచారు. ఒక రకంగా వచ్చే ఎన్నికలలో రమణారెడ్డి కే టిక్కెట్‌ అన్నది తేల్చేశారు. తగాదాలు వద్దని చెప్పేశాడు. పేచీలకు తావు లేదని స్పష్టం చేశాడు. 

రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…రెండు సార్లు ఎమ్మెల్యే…ఒకసారి ఎమ్మెల్సీ…

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌. ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…ఆనాడైనా, ఈనాడైనా అభివృద్ధికి కట్టుబడి వున్న నాయకుడు రమణారెడ్డి. ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…పని చేయడం మాత్రమే రమణారెడ్డికి తెలుసు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం అనేది జిల్లా ప్రజలే చెప్పుకుంటున్న మాట. అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం. ఆది నుంచి రమణారెడ్డి వ్యక్తిత్వం. నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం. అని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎప్పుడూ చెప్పుకునే మాట. పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా వుండడం రమణారెడ్డి కి తెలుసు. వారి సాధక బాదకాలు పట్టించుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు అనే మాట వుంది. పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు. నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *