తెలంగాణకు చెదపురుగు షర్మిల!

-ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చురేపడానికి వచ్చిన చీడ పురుగు.

-చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయాలు తెలంగాణలో చెల్లవు.

-తెలంగాణ శత్రువులకు ఇక్కడ చోటులేదు.

-తెలంగాణను దోచుకున్న వాళ్లకు మాట్లాడే అర్హతలేదు.

-షర్మిల దొంగ దీక్షలు…తెలంగాణ మీద లేని ప్రేమలు, పిచ్చి భ్రమలు ప్రజలకు తెలుసు.

-ఒకనాడు తెలంగాణకు నిలువు, అడ్డం నిలబడిరది వైఎస్‌…

-ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం షర్మిల.

-తెలంగాణను తూర్పారపట్టి, ఒట్టిపోయిన ఆవును చేసింది వైఎస్‌.

-అదే తెలంగాణను గంగి గోవును చేసింది కేసిఆర్‌.

-తెలంగాణను ఎండబెట్టింది వైఎస్‌…

-తెలంగాణను సిరుల మాగాణ చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ అంటే నిలువెల్ల విషం నింపుకున్నది వైఎస్‌…

నిలువెల్ల గాయాలను మాన్పి, నిత్య వసంతం చేసింది కేసిఆర్‌.

-మా గురించి ప్రశ్నించే అర్హత వుందా?

-తోడ బుట్టిన అన్ననే దూరం పెట్టాడు. 

-ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు.

-వారసత్వంగా పంచుకోవడానికి రాష్ట్రాలేమైన ఆస్థులా?

-బయ్యారం గనుల కోసమే తెలంగాణలో రాజకీయాలా!

-మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్యూ..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నేకొక గిరిజనబిడ్డను…ఉన్నత విద్యావంతుడను. ఉన్నతమైన ఆశయాలుకల్గిన వ్యక్తిని. సమాజంలో అట్టుడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సామాజిక వేత్తను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిని. రెండు సార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిదిని. మహబూబాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న ఎమ్మెల్యేను. నేను చేసిన అభివృద్ధిని, దాని నమూనాను ప్రజల ముందు వుంచిన ప్రజా నాయకుడిని. అలాంటి నాపై ఆరోపణలు చేసి, నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, రాజకీయాల కోసం బురద జల్లిపోతా? అంటూ ఊరుకోవాలా? మర్యాద, మన్నన లేకుండా కుసంస్కారవంతమైన భాషను ఉపయోగించి, నన్ను మరో రకంగా సంబోధిస్తూ, నా నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి ప్రేలాపణలు చేస్తుంటే నవ్వుతూ చూస్తుండాలా? ఇదేనా షర్మిల నేర్చుకున్న సంస్కారం? రాజకీయాల పేరుతో యాత్రను నిర్వహిస్తూ నియోజకవర్గాలలో పర్యటిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే విని సంబరపడమంటారా? షర్మిల ఎంతైనా మాట్లాడొచ్చా? అదే తెలంగాణ నాయకులు మాట్లాడితే తాను మహిళను అన్నది గుర్తుకొస్తందా? దేశంలో ఏ మహిళా నాయకురాలైనా షర్మిల మాట్లాడినట్లు మాట్లాడుతున్నారా? ఇంత దిజగారి వ్యాఖ్యలు చేస్తున్నారా? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం ఎక్కడైనా చూశామా? దొంగే..దొంగ అన్నట్లు 2004 ఎన్నికల ముందు ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేక, ఇంటిని అమ్ముకున్న రాజశేఖరెడ్డి ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ప్రజలు మర్చిపోయారా? ఆ రోజుల్లో విమర్శల పాలైంది ఎవరు? జైలు పాలైంది ఎవరు? ఎందుకు కేసులు ఎదుర్కొన్నారు? ఇవన్నీ మాట్లాడాలంటే మాకు మాటలు రావా? మేం మాట్లాడలేమా? మహబూబాబాద్‌ చూపిన రుచి మర్చిపోరాయా? ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఎక్కడా నా కుటుంబం మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటిది నా సతీమణి గురించి మాట్లాడడాన్ని కూడా సహించమంటారా? ఒక మహిళ సాటి మహిళ గురించి మాట్లాడాల్సిన మాటలేనా? నేనూ మాట్లాడగలను? కాని నాకు సంస్కారం అడ్డొస్తోంది? అయినా రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలి. అంతే గాని వ్యక్తిగత విమర్శలు..దూషణలు…వేలం వెర్రి మాటలు..పిచ్చి కూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఇంకోసారి షర్మిల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తే సహించే ప్రసక్తే లేదు. ఇంత కాలం ఆమెను పట్టించుకున్న వారే తెలంగాణలో లేరు. బిఆర్‌ఎస్‌ అసలే పట్టించుకోలేదు. దాంతో ఎలాగైనా వివాదాలను సృష్టించి మీడియాలో హల్‌ చల్‌ చేస్తేచాలు..అదే రాజకీయం అనుకునే భ్రమల్లో షర్మిల వుంది. అందుకే ఇలాంటి కూతలు కూస్తోందని అంటున్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…ఆయన మాటల్లోనే…!

అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, రాజకీయ అవసరాలకోసం ఎంతకైనా దిగజారే తనం..ఇదంతా షర్మిల కుటుంబానికి చెందిన అనుభవం.

అందరూ అలాగే వుంటారని అనుకుంటే పొరపాటు. 2004 ఎన్నికల ముందుకు ఎలాగైనా తెలంగాణ సీట్లు ఎక్కువ గెలిస్తే తప్ప అధికారంలోకి రాలేమని, జై తెలంగాణ అని అంటే తప్ప తెలంగాణలో ఓట్లు రావని తెలిసి, బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చి మోసం చేసింది వైఎస్‌. బిఆర్‌ఎస్‌తొ పొత్తు పెట్టుకొని తెలంగాణలో గెలిచిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలంగాణ వాదమే లేదని నిరూపించే ప్రయత్నం చేసి నమ్మక ద్రోహి వైఎస్‌. రాజశేఖరరెడ్డి. తెలంగాణభూములను తెగనమ్మి, తెలంగాణలో అభివృద్ధిని కుంటుపర్చి, ఆంధ్రకు నిధులను తరలించి దుర్మార్గుడు. తెలంగాణను ఎండబెట్టి, పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి, నీళ్లను రాయలసీమకు తరలించి, తెలంగాణ రైతాంగం గోస పుచ్చుకున్న వ్యక్తి వైఎస్‌. తన జీవితంలో ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసి, తన స్వార్ధం కోసం తెలంగాణను ఉపయోగించుకొని ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించాడన్న అపవాదు ఎదుర్కొన్న నాయకుడు వైఎస్‌. ఆనాడు 2004లో ఏ వామపక్షాలతో ఆయన జతకట్టాడో వారిని కూడా నిండా ముంచి, వారి చేతే లక్ష కోట్లు దోచుకున్న వైఎస్‌ అన్న అపవాదును మోసిన నాయకుడు వైఎస్‌. ఇదీ ఆయన చరిత్ర. నీచ రాజకీయం. నూరు గొడ్లను తిన్న రాబందు నీతులు వల్లించినట్లు ఇప్పుడు తగుదునమ్మా! అని తెలంగాణ గురించి షర్మిల మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. దాని త్యాగం తెలియదు. తెలంగాణ గోస తెలియదు. తెలంగాణ సంస్కృతి తెలియదు. తెలంగాణ బోనం తెలియదు. తెలంగాణ బతుకమ్మ తెలియదు. బోనం నెత్తినపెట్టబోతే, బొట్టు పెట్టబోతే తెలంగాణ మహిళలపై గుడ్లు పద్దవి చేసుకొని చూసిన షర్మిలనా తెలంగాణ ప్రజలకు మేలు చేసేది…తెలంగాణలో రాజకీయాలు చేసేది…చెప్పుకోవడానికి కొంచెమైనా ఇంగితం వుండాలి! 

  మహబూబాబాద్‌ లాంటి వెనుకబడిన ప్రాంతాన్ని మరింత వెనుకబాటుకు గురి చేసిందే వైఎస్‌. 

అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు సస్యశ్యామలం చేసిందే ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఎమ్మెల్యేగా నేను..అంతే కాని ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్‌ పరిస్ధితి ఏమిటో ప్రజలకు తెలుసు. అమ్మ పుట్టిల్లు గురించి మేన మామ ముందు గొప్పలు చెప్పినట్లు…మహబూబాబాద్‌ గురించి షర్మిలకు తెలిందల్లా ఒక్క బయ్యారం గనులు…! మాత్రమే..ఇప్పుడు ఆమే చేసే రిజకీయమంతా అందుకే!! తెలంగాణ ఉద్యమ కాలంలో జై తెలంగాణ అన్న ఎంతో మంది ఉద్యోగులను వేధించింది ఎవరో కాదు…షర్మిల తండ్రి వైఎస్‌. ఉద్యోగులను పీడిరచింది…జై తెలంగాణ అనకుండా దారిలోకి తెచ్చుకునేందుకు ఏసిబితో దాడులు చేయించి, ఎంతో మంది ఉద్యోగులను కేసుల్లో ఇరికించిన చరిత్ర వైఎస్‌ది.

నేను తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తుండడాన్ని జీర్ణించుకోలేక, ఉద్యోగ వేధింపులను కూడా భరించాను. చివరికి ఉద్యోగం కూడా వదులుకొని తెలంగాణ కోసం ఉద్యమించాను. ఇదీ నా చరిత్ర. పిల్ల బిత్తరులంతా వచ్చి, పిచ్చి పిచ్చి ప్రేళాపణలు చేస్తే, నా ఉద్యమ చరిత్రకు చెదలు పడుతుందా? ఇరవైఏ ళ్లకిందనే లక్ష కోట్లు దోచుకున్న దొంగల కుటుంబం అని ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్‌ కూతురు షర్మిల తెలంగాణ నాయకుల మీద లేని పోని అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరు. అంతదాకా ఎందుకు ఆమె మహబూబాబాద్‌లో మాట్లాడుతన్న సందర్భంలో ప్రజలనుంచి ఎలాంటి సందన కనిపించలేదు. ఒకటికి రెండుసార్లు ప్రజలు అడిగినా ఎవరూ చప్పుడు చేయలేదు. ఆ వీడియాలను స్పష్టంగా చూస్తే నన్ను విమర్శిస్తున్న సందర్భంలో ప్రజలు ఆక్రోశంగా చూశారే…! ఆమె మాటాలకు స్పందిచలేదు. ఇది ఆమె గమనించింది. అందుకే ఇక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిరది. 

తెలంగాణ అనే పదాన్నే మాట్లాడేందుకు ఇష్టపడని ఆ కుటంబం చేసింది ఏమిటో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ రాళ్లకు తెలుసు. 

ఇప్పటికీ తెలంగాణ వాదులు ఆ రాళ్లకు పూజలు చేయడం తెలుసు. అలాంటి మహబూబాబాద్‌లో తనపై షర్మిల పిచ్చాసుపత్రిని నుంచి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు పట్టించుకుంటారా? ఆనాడు ఆమె తండ్రి తెలంగాణను దోచుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజల విరాళాలతో పార్టీ నడుపుతోంది. పూట గడుపుకుంటోంది. ఇంతకన్నా సాక్ష్యం మరొకటి అవసరం లేదు. తెలంగాణ మీద పడి దోచుకోవడానికి అలవాటు పడిన ప్రాణం ఊరుకోలేకపోతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినా వారి ఆశలు చావడం లేదు. దోచుకోవడం ఆగిపోవడం జీర్ణం కావడం లేదు. షర్మిల తెలంగాణ వాది కాదు..తెలంగాణ కోసం కొట్లాడిరది లేదు. తెలంగాణకు మేలు చేసే పని ఏనాడు చేసింది లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి అసవరమైన నిధులు ఎక్కడివి? అంత సంపాదన ఎక్కడిది? ముందు ఈ సంగతి చెప్పాలి. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునేందు, కాలం కలిసొస్తే, చేజారిపోయిన బయ్యారం కలలు నిజం చేసుకునేందుకు తప్ప తెలంగాణ మీద ప్రేమ కాదు….ఆమె కు తెలంగాణకు సంబంధం లేదు…తెలంగాన అనే పదమే ఒక ఉద్యమ కణిక…ఎన్నేళ్లైనా దాని సెగ తగ్గేది కాదు…దోచుకునేవారికి ఇక్కడ చోటు లేదు…ప్రజలు కూడా ఇవ్వరు…! షర్మిల భ్రమల్లో బతకడం మానుకుంటే చాలు!! పిచ్చి వాగుడు వాగినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *