కాలం చెల్లిన మందులతో రోహిణీ పాడు వైద్యం!

`కాసుల కోసం రోహిణి పాపపు పని.

`వైద్యం వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం.

`ఫార్మాసిస్ట్‌ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్‌ సంచలన ఆరోపణలు.

`నేటిధాత్రికి వెల్లడిరచిన భయంకరమైన నిజాలు.

`సాక్షాదారాలతో సహా రోహిణి గుట్టువిప్పాడు.

`పరాకాష్ఠకు చేరిన రోహిణీ దుర్మార్గం!

`కాలం చెల్లిన మందులు అమ్ముతూ పట్టుబడిన దొంగ వ్యవహారం.

`ప్రజల జీవితాలతో చెలగాటం!

`కాలం చెల్లిన మందులను అంటగట్టడం.

`ఫార్మా కంపెనీలతో లాలూచీ పైత్యం.

`కంపనీలకు మేలు కోసం తప్పుడు మార్గం.

`వైద్యం ముసుగులో అనైతిక వ్యాపారం.

`గత కొన్ని నెలలుగా జరుగుతున్న అక్రమ దందా!

`అమాయకుల జీవితాలు ఫణంగా!

`పేదల రక్తం తాగుతున్న యాజమాన్యం.

`గతంలో రోహిణి మీద అనేక ఆరోపణలు.

`అయినా పద్దతి మారని యాజమాన్య తీరు.

`ఆసుపత్రి యాజమాన్యాలలో పెద్ద తలకాయలు.

`ప్రజాసేవ ముసుగులో వున్న బడా రాజకీయ నాయకులు.

`తమను పట్టుకునేదెవరన్న భరితెగింపు.

`ప్రజలను వైద్యం పేరుతో పీడిరచుకుతింటున్నారు.

`కాలం చెల్లిన, నకిలీ మందులు అంట గడుతున్నారు.

`తప్పు బైటపైడినా గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్‌ చేసుకున్నారు.

`ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులిస్తున్నారు.

`ప్రజారోగ్యం పేరుతో ప్రాణాలు తోడేస్తున్నారు.

కాసుల కక్కుర్తి కోసం కార్పోరేట్‌ ఆసుపత్రులు ఎంతకైనా దిగజారుతాయని చెప్పడానికి రోహణీ ఆసుపత్రిలో జరుగుతున్న పాడు వ్యాపారమే అందుకు నిదర్శనం. కాలం చెల్లిన మందులు అమ్మకుండా చూసుకోవాల్సిన ఆసుపత్రులే, ఆ మందులను రోగులకు అంటగట్టే పాపాపు వ్యాపారం చేస్తున్నారు. గత కొంత కాలంగా హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి నిర్వాకం బైట పడిరది. ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్ధాపక అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్‌ కొన్నేళ్లుగా అక్రమ మందుల వ్యాపారం మీద పోరాటం చేస్తున్నారు. మందుల దుకాణాలు సాగిస్తున్న అక్రమ దందాలను ఆసుపత్రులు ఎలా సహకరిస్తున్నాయో అనేక విషయాలు వెలుగులోకి తెచ్చారు. తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎంతో పేరు గాంచిన రోహిణీ ఆసుపత్రిలో కూడా కొంత కాలంగా రోగులకు కాలం చెల్లిన మందులను అమాయక ప్రజలకు అంటగడుతున్నారే విషయం తెలిసి, నిఘా పెట్టారు. రెడ్‌ హాండెడ్‌గా రోహిణీ ఆసుపత్రిలో వున్న మందుల దుకాణంలో సాగుతున్న చీకటి కోణాన్ని వెలికి తీశారు. ఇప్పటికే రోహిణీ ఆసుపత్రిపై అనేక ఆరోపణలున్నాయి. ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలే కాదు, ఇతర సదుపాయాలు కూడా లేక గతంలో అగ్ని ప్రమాదం కూడా జరిగింది. రోగుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ సమయంలో ఇద్దరు రోగులు మరణించారు. ఎంతో మంది రోగులు ఊపిరాడని పరిస్ధితిలో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇతర ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. రోహిణీ ఆసుపత్రి నిబంధనలు గాలికి వదిలేసి వైద్యం చేయడంలో ప్రమాదాలు చోటు చేసుకున్నది. ఇప్పటికీ రోగుల క్షేమంపై ఎలాంటి శ్రద్ద పెట్టడం లేదు. పైగా రోగులకు నకిలీ మందులను అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందంటున్న బత్తిని సత్యనారాయణ నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు వెల్లడిరచిన సంచలన నిజాలు ఆయన మాటల్లోనే…

రోహిణీ ఆసుపత్రి నిర్వాకం పరాకాష్టకు చేరిందని బత్తిని సత్యనారాయణ గౌడ్‌ ఆరోపించారు. రోహణీ ఆసుపత్రికి చెందిన మెడికల్‌ షాపులో అమ్ముతున్న కాలం చెల్లిన మందులను చూపించారు. ఆ మెడికల్‌ షాపులో కొన్నట్లు రిసీట్లు కూడా తీసుకున్నాడు. అయినా కాలం చెల్లిన మందులను అమ్ముకోవాల్సిన దుస్తితికి ఆసుపత్రులు దిగజారడం అంటే ఇక నైతికతకు తావెక్కడుంది? ప్రజల ప్రాణాలు వైద్యులు కాపాడుతారన్న భరోసా ఎలా వుంటుంది? ఒక్కరు చేసే పాపం మిగతా వైద్య సమాజానికంతటికీ చుట్టుకుంటుంది. వైద్యమంటే సామాన్యులు భయపడిపోయే పరిస్దితి దాపురిస్తుంది. ఇప్పటికే కార్పోరేట్‌ ఆసుపత్రలుకు వెళ్లితే ఆస్ధులు అమ్ముకోవాలి. అయినా ప్రాణం నిలుస్తున్న నమ్మకంలేదన్న భయం ప్రజల్లో వుంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి మెరుగైన వైద్యం అందించి దేవుళ్లుగా కొనియాడబడాల్సిన, ఆసుపత్రులే దేవాలయాలుగా కొనియాడాల్సిన సమయంలో అవి నరక కూపాలుగా మారుతుంటే వారి గోడుకు దిక్కేది. ప్రజల ప్రాణాలతో చెలగామాడడం నేరం. అయినా యదేచ్చగా రోహణీ ఆసుపత్రి నిర్వాకం వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రోహిణీ ఆసుపత్రిలో జరగుతున్న అక్రమ దందా వ్యవహారంపై అనేక సార్లు డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆధికారులకు సమాచారం అందించడం జరిగింది. వారి నిర్లిప్తత కూడా ఇక్కడ కనిపిస్తోంది. రోహిణీ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు అమ్ముతున్నారంటూ సమాచారం అందిస్తే వరంగల్‌ గ్రడ్‌ కంట్రోల్‌ అధికారులు సంబంధిత ఫార్మసిస్టులకు విషయాలను చేరవేసి వారిని పలుసార్లు కాపాడుతూ వచ్చారు. నా వద్ద వాటిపై సమగ్రమైన వివరాలున్నాయి. వాటిని పూర్తి వివరాలు అనేక సార్లు అందించినా డ్రగ్‌ కంట్రోల్‌ వింగ్‌ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దాంతో ఆసుపత్రి యాజమాన్యం మరింత విచ్చలవిడిగా తయారైంది. నిరుక్షరాస్యులు, కొనుగోలు చేసిన మందులపై అవగాహన లేని వాళ్లను ఏరి కోరి ఆ మందులను అంటగడుగున్నారు.

హన్మకొండలో వున్న ఫార్మసిస్టు సంక్షేమ సంఘం సభ్యుల ఒత్తిడి మేరకు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు మెడికల్‌ షాపులో నిలువ వున్న కాలంచెల్లిన మందులను పట్టించారు. కొన్ని లక్షల రూపాయల మందులను విక్రయించేందుకు మెడికల్‌ షాపులో వుంచారు. కొన్ని సంవత్సరాలుగా రోహిణీ ఆసుపత్రి మీద అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. అయినా ఆసుపత్రి వ్యహరంలో మార్పు రావడంలేదు. ఆసుపత్రి తీరులో మారలేదు. ఆసుపత్రి యాజమాన్యాల వెనుక పెద్ద తలకాయాలున్నాయి. రాజకీయంగా వున్న పలుకుబడిని ఉపయోగంచుకొని ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. రోహిణీ స్ధానంలో మరే ఆసుపత్రి వున్నా ఇప్పటికే ఎప్పుడో కఠినమైన చర్యలు తీసుకునేవారు. ఆసుపత్రినే మూసేసేవారు. కాని ఎన్ని సంఘటలను వెలుగులోకి విచ్చినా ఆసుపత్రిపై చర్యలులేవు. కార్పోరేట్‌ ఆసుపత్రులలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా వాటి జోలికి పోలేని వ్యవస్ధ వుండడం ప్రజల దౌర్బాగ్యం. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న భరితెగింది ఆసుపత్రికి బాగా పెరిగిపోయింది. తమను పట్టుకునేదెవరు? అన్నంత ధీమా ఆసుపత్రి యాజమాన్యానికి వుంది. దాంతో వారు ఆడిరది ఆట..పాడిరది పాట అన్నట్లు వైద్యానికే కళంకం తెస్తున్నారు. రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ప్రజలను వైద్యం పేరుతో పీడిరచుకుతింటున్నారు. తప్పు బైట పడినా సరిదిద్దుకున్న దాఖలాలు ఏనాడు లేవు. ప్రాణాలు కాపాడాల్సిందిపోయి, వారి ప్రాణాలను మరింత సంకటంలోకి పడేసే దుర్మార్గం ఎవరూ చేయరు. కాని రోహణీ ఆసుపత్రి చేస్తోంది. అందుకు కాలం చెల్లిన మందులే సాక్ష్యం. ఇంతకన్నా ఏం కావాలి? ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రే ప్రాణాలు తోడేస్తుంటే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం వుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల అనేక సందర్భాలలో చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వాళ్లైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించాల్సిన అవసరం వుంది.

కాలం చెల్లిన మందులు ఇప్పటికే ఎంత మందికి అంటగట్టారన్న లెక్కలు తీయాలి. ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమ దందా మీద విచారణ చేపట్టాలి. ఆ మందులు వాడిన వాళ్ల పరిసి ్దతి ఎలా వుందన్న దానిపై నివేదిక కోరాలి. అలా అయితే గాని ఆసుపత్రి యాజమాన్యంలో మార్పు రాదు. అసలు ఆసుపత్రిలోనే సరైన సౌకర్యాలు లేవన్నది గతంలోనే తేలిపోయింది. ఇప్పుడు మందుల కంపనీలు ఇచ్చే లాభాల కోసం లాలూచీ పడి, కాలం చెల్లిన మందులను అంటగడుతున్న రోహణీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక రోహిణీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న మెడికల్‌ షాపుకు ఫస్సీ సర్టిఫికెట్‌ లేదు. దేశంలో ఏ మెడికల్‌ షాపుకైనా సరే ఫస్సీ సర్టిఫికెట్‌ తప్పనిసరి. కాని రోహిణీ ఆసుపత్రిలో వున్న మెడికల్‌ షాపుకు ఫస్సీ సర్టిఫికెట్‌ లేదు. అయినా ఆహార పదార్ధాలకు సంబంధించిన మందుల విక్రయం కూడా యదేచ్చగా సాగిస్తున్నారు. ఇది నేరమని తెలిసినా మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారన్న నిర్లక్ష్యంతో ఇలాంటి దొంగ దందాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులపై ప్రజలు కూడా అక్రమత్తంగా వుండాలి. గ్రామాలలో వుండే ఆర్‌ఎంపిల సూచనల మేరకు పెద్దఎత్తున గ్రామీణ ప్రాంత ప్రజలు రోహిణీకి వైద్యానికి వస్తుంటారు. పల్లె ప్రజలకు ఆసుపత్రుల మీద సరైన అవగాహన లేకపోవడంతో అమాయక ప్రజలు రోహణీకి వస్తుంటారు. ఇలా వచ్చిన రోగుల నుంచి పెద్దఎత్తున ఫీజులు వసూలు చేసుకొని, ఆర్‌ఎంపిలకు కమీషన్లు ఇచ్చి, మెడికల్‌ షాపులో కాలం చెల్లిన మందులు అమ్ముతూ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దృష్టిపెట్టాలి. ప్రజా రోగ్యం కన్నా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు ఆసుపత్రి యాజమాన్య ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? అన్నది కూడా చెప్పాల్సిన అవసరం వుంది. ఇంత పెద్ద మొత్తంలో కాలం చెల్లిన మందులు పట్టుబడినా ఇంత వరకు రోహణీ ఆసుపత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులే చెప్పాలి. ఏది ఏమైనా ప్రజల్లో చైతన్యం కూడా ఎంతో అవసరం. ఇలాంటి మోస పూరితమైన ఆసుపత్రులపై అవగాహన పెంచుకోవాలి. త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆసుపత్రుల లిస్టులు విడుదల చేస్తాం. ప్రజలను చైతన్యం చేస్తాం. ఆయా ఆసుపత్రులకు ప్రజలు వెళ్లి ప్రాణాలు జేబులు గుల్ల చేసుకోకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా అవగాహానా కార్యక్రమాలు నిర్వహిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!