
పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడుగా పొరండ్ల రమేష్….
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) కమలా పూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం పద్మశాలి కుల సంఘం నూతన కమిటీని సోమవారం రోజున జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా పోరండ్ల రమేష్, ఉపాధ్యక్షుడిగా వైకుంఠం,ప్రధాన కార్యదర్శిగా చిందం గౌరిశంకర్, కోశాధికారిగా పోరండ్ల అశోకు తో పాటుగా ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా తమపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు కుల సంఘం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.