NETIDHATHRI

శ్రీపతి నగర్ లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణంలోని శ్రీపతి నగర్ 44వ బూతులో సీసీ రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోత్కు సుదర్శన్, శ్రీపతి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిమల్ల నర్సింగ్, నుగురి రాధ ల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు వెంటనే స్పందించి రాబోయే సిడిపి నిధుల నుండి శ్రీపతి నగర్ లో…

Read More

4 న జరిగే పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటి రాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూతేదీ 04/02/2024 రోజునా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు మరియు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అర్బన్, బ్లాక్, డివిజన్, మహిళా మండల అధ్యక్షురాలు, జిల్లా మహిళా కాంగ్రెస్ సభ్యులు, మహిళా సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు, పిఎసిఎస్…

Read More

కుష్టు వ్యాధి నివారణ పై అవగాహన సదస్సు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో ప్రపంచ కుష్టు వ్యాధి నివారణపై శనివారం రోజున ఒడితల మెడికల్ ఆఫీసర్ నవత ఆదేశాల మేరకు ఏఎన్ఎం సుమలత ,ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బాలకృష్ణ, హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు చర్మవ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా శరీరంపై ఏర్పడే మచ్చలను గమనించి వాటికి…

Read More

మున్సిపల్ చైర్మన్ ,కౌన్సిలర్లకు షోకజ్ నోటీసు

# నర్సంపేట పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్. నర్సంపేట , నేటిధాత్రి : నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మాన విషయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నియమాలికి కట్టుబడి ఉండని మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్, 12వ వార్డు కౌన్సిలర్ ఎండి పాషా, 24 వ వార్డు కౌన్సిలర్ దార్ల రమాదేవిలకు షోకజ్ నోటీసులు జారీ చేసినట్లు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట నారాయణ గౌడ్ ప్రకటన విడుదల…

Read More

కల్పవృక్ష నారసింహ స్వామి దర్శనం కొరకు వచ్చిన గిరిజన సాధు మహారాజులు……..

భద్రాచలం నేటి దాత్రి కలి బాధలో బాపే కల్పవృక్ష నారసింహుని దర్శనం మా పూర్వజన్మ సుకృతం……. మేడారం జాతరకి వెళ్లే ముందు పుడుపులు సమర్పిస్తున్న వైనం….. భద్రాచలం : గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఉన్న శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామమూర్తికి జగదాంబ మేడారం భద్రకాళి పూజారుల సంఘం తరఫున స్వామివారికి అమ్మవార్లకు పూలు పండ్లు,పట్టు వస్త్రాలను మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి సమర్పించడం జరిగినది. ఎంతోమంది భక్తులు కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు…

Read More

వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం

*హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు,రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు. గత ఎన్నికల్లో నా గెలుపు కోసం…

Read More

సింగరేణి గ్రామ పంచాయతీ సిబ్బంది గౌతమ్ ను శాలువాతో సన్మానించిన సర్పంచ్ శ్రవంతి.ఎంపిటిసి రమాదేవి

కారేపల్లి నేటి ధాత్రి సింగరేణి గ్రామ పంచాయతీ వర్కర్ ఆదేర్ల గౌతమ్ పంచాయతీ విధులను సక్రమంగా నిర్వహించారని గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి కాలం ముగిసిన నందున పంచాయతీ సిబ్బంది గౌతమ్ ను సర్పంచ్ ఆదేర్ల శ్రవంతి మరియు ఎంపిటిసి ఇమ్మడి రమాదేవి శాలువా కప్పి సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి గ్రామ పంచాయతీ విదులు సక్రమంగా నిర్వహించారని ఎలాంటి పని విషయం లో నైనా విసుగక విధినిర్వహణలో తనతో పాటు వర్కర్లకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా…

Read More

తెలుగు విభాగంలో డా. జె. పద్మ కు డాక్టరేట్

కేయూ క్యాంపస్ కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పరిశోధకురాలు జక్కె పద్మ కు డాక్టరేట్ ప్రకటించినట్టు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి. మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. “తిక్కన మహాభారతం – మౌసల నుండి స్వర్గారోహణ పర్వము వరకు-విమర్శనాత్మక పరిశీలన అనే అంశంపై విశ్రాంతాచార్యులు కొండా యాదగిరి పర్యవేక్షణలో పద్మ పిహెచ్. డి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన జక్కె పద్మ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల…

Read More

బీజేపీ జిల్లా అధ్యక్షునికి సన్మానం

రేగొండ,నేటిధాత్రి: నూతనంగా ఎన్నికైన జయశంకర్ భూపాలపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశీధర్ రెడ్డిని శనివారం బీజేపీ మండల నాయకులు రేగొండలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్రం సదాశివుడు,మాత్నపల్లి అరవింద్,గొడుగు మోహన్ తదితరులు ఉన్నారు.

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు వేములవాడ రూరల్ నేటి ధాత్రి వేములవాడ రూరల్ మండలంలో ని చెక్కపల్లి లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు చదువు కున్న విద్యార్థులు వారంతా చిన్ననాటి స్నేహితులు.. ఒకేచోట చదువుకున్నారు..చదువులు పూర్తి అయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. వేములవాడ రూరల్ మండలంలో ని చెక్కపల్లి గ్రామంలో ప్రథమిక ఉన్నత పాఠశాలలో 1991-92 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు శుక్రవారం…

Read More

డాక్టర్ సాధించిన జ్యోతి Dr. Guguloth Jyothi

కేయూ క్యాంపస్ కాకతీయ విశ్వవిద్యాలయ సోషియాలజీ విభాగ పరిశోధకురాలు గుగులోత్ జ్యోతి కి విశ్వవిద్యాలయ పరిక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి డాక్తోరాటే ప్రకటించారు. డాక్టర్ గుగులోత్ జ్యోతి “విమెన్ ఇన్ అన్ అర్గనైజేడ్ సెక్టార్ – ఎ స్టడీ ఆన్ కన్స్ట్రక్షన్ లేబర్ ఇన్ వరంగల్ సిటీ అఫ్ తెలంగాణా స్టేట్ అనే అంశం పై విభాగ ఆచార్యులు ఆచార్య టి.శ్రీనివాస్ పర్యవేక్షణలో పూర్తి చేసారు. ఎల్లందు గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందినా…

Read More

రాందేవ్రావు హాస్పిటల్ లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.

కూకట్పల్లి, ఫిబ్రవరి 03 నేటి ధాత్రి ఇన్చార్జి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంద ర్భంగా రాందేవ్రావ్ ఆసుపత్రి సర్వై కల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా రాందేవ్ రావు ఆసుపత్రి దత్తత తీసుకున్న పాఠశాలలలోని 9 నుండి 15 సంవత్సరంలోపు ఉన్న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివా రణ కోసం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ప్రతి బుధవారం, శనివారము నిర్వహిస్తున్న ఈ కార్య క్రమంలో భాగంగా 18 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న రాందేవ్…

Read More

హైదరాబాద్‌లో నలుగురు గుజరాత్ సైబర్ మోసగాళ్ల అరెస్ట్

హైదరాబాద్: ‘డేటా ఎంట్రీ జాబ్’ అంటూ ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఐదు డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో గుజరాత్‌కు చెందిన రాహుల్ అశోక్ భాయ్ బవిస్కర్ (25), సాగర్ పాటిల్ (24), కల్పేష్ థోరట్ (26), నీలేష్ పాటిల్ (24) ఉన్నారు. అశోక్ ‘ఫ్లోరా సొల్యూషన్’ అనే కంపెనీని ప్రారంభించాడని, హోమ్ బేస్డ్ డేటా…

Read More

మృతుని కుటుంబానికి పరామర్శ.

#మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత కొద్ది రోజుల క్రితం మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్దూరి కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన దశదిన కర్మకు మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి హాజరై మృతుని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన వెంట…

Read More

గీత కార్మికులకు సేఫ్టీమోకు మోపేడ్ లు పంపిణీ చేయాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : గీత కార్మికులకు వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీమోకు, మోపేడ్ బైక్ లు పంపిణీ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ…

Read More

వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర బడ్జెట్‌

 రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు నర్సంపేట,నేటిధాత్రి : 2024 – 25 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు అన్నారు.కేంద్ర బడ్జెటుకు నిరసనగా శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయరంగాభివృద్ధికి నిధులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి…

Read More

పాలకవర్గ సభ్యులకు సన్మానం చేసిన వెంకటరమణారెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ సర్పంచి ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల కేంద్రానికి తంగళ్ళపల్లి సర్పంచ్ గా అనిత రవీందర్ ఉప సర్పంచ్ గా పెద్దూరి తిరుపతి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అలాగే పాలకవర్గ సభ్యులకు ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇట్టి పాలక వర్గానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు…

Read More

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

నడి కూడ,నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య (“న్యూ సైన్స్ ) మహిళ డిగ్రీ, పీజీ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా” ఫిబ్రవరి 4 తేదీన జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మెపా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ నర్సింహుల రాకేష్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెపా రాష్ట్ర అధ్యక్షులు డా.కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని,ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం…

Read More

సమ్మక్క సారక్క జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చందబోయిన రాజు…

నేటి ధాత్రి కమలా పూర్ (హన్మకొండ) కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం శ్రీ సమ్మక్క సారక్క జాతర 2024 ఉత్సవ కమిటీ నియామకం కోసం శనివారం రోజున గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని చైర్మన్ గా చందబోయిన రాజు, ఉపాధ్యక్షుడిగా మోతె జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికైన అనంతరం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ను కలుసుకొని జాతర ఏర్పాట్ల కోసం వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల…

Read More

‘పనులు పూర్తయిన తర్వాత’ మేడిగడ్డ బ్యారేజీ వ్యయం ₹1,350 కోట్లు పెరిగింది.

నీటిపారుదల శాఖ ఎలాంటి నాణ్యతా పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టు ఏజెన్సీ చేసిన పనుల్లో నాణ్యత లేని కారణంగా గత అక్టోబరులో నిర్మాణాత్మకంగా నష్టపోయిన మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ఆధారం లేకుండా ‘పూర్తి’ అయినా ఖర్చు పెరిగింది. కానీ కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశపూర్వక లక్ష్యంతో. కొనసాగుతున్న కసరత్తులో భాగంగా ఈ సమస్యపై విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో ఇది కొత్త మరియు ఆశ్చర్యకరమైన బహిర్గతం. అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం కోసం ఇచ్చిన ప్రారంభ మొత్తం నుండి ఒకసారి…

Read More
error: Content is protected !!