గంజాయ్, గుట్కా, గుడుంబా నియంత్రణపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం.
భూపాలపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మకాలు జరగకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గుడుంబా, గుట్కా, గంజాయి అమ్మకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో జిల్లాలో గుడుంబా, గుట్కాల అమ్మకం…